అక్లూర్ గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. VBG RAM G 2026–2027 కింద గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గ్రామసభలో గుర్తించారు.




