మంగళగిరిలో సేవా సంకల్ప యాత్ర.. ఘనస్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని చేపట్టిన ‘సేవా సంకల్ప యాత్ర’కు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘన స్వాగతం లభించింది. తిరుపతి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మంగళగిరికి చేరుకోగా టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, పిల్లి మాణిక్యాలరావు, MLA మొహమ్మద్ నసీర్, మాజీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు, తదితరులు స్వాగతం పలికారు. ధనుంజయరావు మాట్లాడుతూ.. మోదీ ప్రజాసేవ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని తెలిపారు.



