వైఎస్సార్సీపీ ఆఫీస్‌లో గాంధీ, శాస్త్రి జయంతి

మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, మాజీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ పాటించిన సత్యం, అహింస, శాస్త్రి చూపిన నిజాయితీ, దేశసేవ నేటి తరానికి ఆదర్శమని నాయకులు తెలిపారు.



