రేపు మండల స్థాయి క్రీడా ఎంపికలు

గోపాల్‌పేట ZPH స్కూల్ గ్రౌండ్‌లో రేపు మండల లెవెల్ స్పోర్ట్స్ సెలెక్షన్స్ జరగనున్నట్లు HM సురేందర్ రెడ్డి, పీఈటీ వహీద్ తెలిపారు. కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, చెస్, క్యారమ్ గేమ్స్‌లో ఎంపికలు ఉంటాయన్నారు. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఈ నెల 16, 17న వనపర్తిలో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు.

