డిగ్రీ కంటే స్కిల్సే ముఖ్యం.. గూగుల్ కొత్త హైరింగ్!

టెక్ ప్రపంచంలో డిగ్రీల కంటే నైపుణ్యాలకే ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతోంది. గూగుల్ డీప్మైండ్లో AI కోడింగ్ ఏజెంట్ల కోసం ఏర్పాటు చేసిన ‘పోలారిస్’ టీమ్ ఉద్యోగాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ ఉద్యోగాలకు డిగ్రీ తప్పనిసరి కాదని, టెక్నికల్ స్కిల్స్ ముఖ్యమని తెలుస్తోంది. ఈ రోల్కు ఏడాదికి ₹11 కోట్ల వరకు జీతం ఉంటుందనే వార్త టెక్కీలను ఆకర్షిస్తోంది. దీంతో డిగ్రీల కంటే ప్రాక్టికల్ స్కిల్స్కే కంపెనీలు ప్రయారిటీ ఇవ్వాలనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



