← Back to news

ఖైరతాబాద్‌ ఉపఎన్నికకు బ్రేక్‌

By Methri Lokesh· 58m ago
ఖైరతాబాద్‌ ఉపఎన్నికకు బ్రేక్‌

TG: ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం బైఎలక్షన్‌కి బ్రేక్ పడింది. ఈ స్థానంలో దానం నాగేందర్‌ గెలుపును సవాల్‌ చేస్తూ 2024లో PJR కూతురు విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. నాగేందర్ ఎన్నిక చెల్లదనీ, రెండో స్థానంలో ఉన్న తానే గెలిచినట్లు ప్రకటించాలని కోరారు. ఈ పిటిషన్ ఇంకా విచారణలోనే ఉంది. ఇది తేలేవరకూ బైఎలక్షన్ కోసం నోటిఫికేషన్‌ ఇవ్వలేమని EC కోర్టుకు తెలిపింది. దీనిపై రాతపూర్వక అఫిడవిట్‌ ఇవ్వాలని ECని కోరిన హైకోర్టు.. హియరింగ్‌ని అక్టోబర్‌ 6కి వాయిదా వేసింది.

More in TG