స్మశాన వాటికలో 'స్వచ్ఛత సేవా

జగిత్యాల సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సత్యహరిశ్చంద్ర స్మశాన వాటికలో 'స్వచ్ఛత సేవా' ప్రోగ్రామ్ నిర్వహించారు. పరిసరాలు, బాత్‌రూమ్‌లు, పూజా మండపాన్ని క్లీన్ చేసి పిచ్చిమొక్కలను తొలగించారు. అంత్యక్రియల టైమ్‌లో ఇబ్బంది కలగకుండా గద్దెల చుట్టూ కొత్తగా మెట్లు నిర్మించారు. పారిశుధ్య కార్మికులను, వార్డు కౌన్సిలర్ ACS రాజును సన్మానించారు. ఈ సేవల్లో కన్వీనర్ రాజేందర్, సభ్యులు పాల్గొన్నారు.



