ఒక గంట Pause.. డిజిటల్ చెల్లింపులు మరింత భద్రం

సైబర్ నేరాలను అరికట్టడానికి ఆర్బీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చెల్లింపుల్లో భద్రతను పటిష్టం చేయడానికి RBI కొత్త ముసాయిదా పత్రాన్ని విడుదల చేసింది. దీని ప్రకారం కొత్త వారికెవరికైనా 10 వేల రూపాయలకు మించి చెల్లింపులు చేస్తే ఒక గంట సేపు గోల్డెన్ అవర్ గా ఫిక్స్ చేసింది. ఎవరైనా కొత్త వాళ్లకు ఆన్ లైన్ లో 10 వేలకు మించి పంపిస్తే గంట తర్వాతే మనీ ట్రాన్సఫర్ అవుతుంది. ఈ లోగా వినియోగదారులకు అనుమానం వస్తే ఆ లావాదేవీని నిలిపివేయొచ్చు. దీనివల్ల సైబర్ మోసాలకు కొంతవరకు అడ్డుకట్టపడుతుందని RBI భావిస్తోంది. దీనిపై మే 8వరకు ప్రజాభిప్రాయాల్ని కూడా సేకరిస్తోంది. ఈ కొత్త ప్రతిపాదనపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి



