బస్సుల్లో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలి

TGSRTC బస్సుల్లో దివ్యాంగులకు మెరుగైన ఫెసిలిటీస్ అందించాలని బీజేపీ దివ్యాంగుల విభాగం కో-కన్వీనర్ బెస్త యాదగిరి డిమాండ్ చేశారు. ఈ మేరకు TGSRTC MDకి వినతిపత్రం ఇచ్చారు. బస్సుల్లో రిజర్వ్‌డ్ సీట్లు అందుబాటులో ఉంచాలని, వీల్‌చైర్ ఫ్రెండ్లీ సౌకర్యాలు కల్పించాలని కోరారు. బస్ పాస్‌లు, ప్రయాణ రాయితీలపై క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

