రాజంపేటలో రాళ్లదాడి

AP: అన్నమయ్య జిల్లా.. రాజంపేటలో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. YCP కార్యకర్తలపై కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. రాళ్ల దాడి చేస్తున్నవారిపై లాఠీ ఛార్జ్ చేశారు. తమ అభ్యర్థులు నామినేషన్స్ వెయ్యకుండా అడ్డుకునేందుకే TDP ఈ కుట్రలకు పాల్పడుతోందని YCP ఆరోపిస్తోంది. మరోవైపు YCPయే కుట్రలు చేస్తోందని TDP ఆరోపిస్తోంది. ఇలా స్థానిక ఎన్నికలు.. రాష్ట్రంలో రచ్చ రేపుతున్నాయి.


