రణరంగమైన పులివెందుల (Video)
AP: కడప జిల్లా.. పులివెందుల నామినేషన్ కేంద్రం రణరంగమైంది. TDP, YCP కార్యకర్తలు కొట్టుకోవడం మొదలుపెట్టారు. పోలీసులు వారిస్తున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. దాంతో గాలిలోకి కాల్పులు జరిపారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు అక్టోబర్ 16న ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ 18 వరకూ కొనసాగనుంది. ఐతే.. ఎక్కడికక్కడ జరుగుతున్న దాడులు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. పోలింగ్ ఎలా జరుగుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


