← Back to news

డ్రగ్స్‌కు 'నో' చెప్పండి!

By BUJJIBABU· 1h ago· Salivahanapeta, Mangalagiri, Guntur
డ్రగ్స్‌కు 'నో' చెప్పండి!

ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఏకే. రవికృష్ణ మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. స్నేహితుల ఒత్తిడికి లొంగకుండా డ్రగ్స్‌కు ధైర్యంగా 'నో' చెప్పాలని సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా చలపతి యూనివర్సిటీ 'Walk for Peace – Stand Against Drugs' నినాదంతో వాకథాన్ నిర్వహించింది. చలపతి యూనివర్సిటీ నుంచి అమరావతి ధ్యాన బుద్ధ విగ్రహం వరకు 15 కిలోమీటర్లు సాగింది. 1,500 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు, యువత పాల్గొన్నారు. డ్రగ్స్ సమాచారం ఉంటే ఏపీ ఈగల్ హెల్ప్‌లైన్ 1972కు తెలియజేయాలని ఐజీపీ కోరారు.

More in Local