‘స..రి..గ..మ..ప..ద..ని..స’ అంటే?

సంగీతంలోని ‘స..రి..గ..మ..ప..ద..ని’ అంటే ఏంటో తెలుసా? ‘స’ అంటే షడ్జమం. దీన్ని నెమలి శబ్దం నుండి తీసుకున్నారు. ‘రి’ అంటే ‘రిషభం’. దీన్ని ఎద్దు రంకె నుండి తీసుకున్నారు. ‘గ’ అంటే ‘గాంధారం’, మేక కూత నుండి తీసుకున్నారు. ‘మ’ అంటే ‘మధ్యమం’. దీన్ని క్రౌంచ పక్షి నుంచి తీసుకున్నారు. ‘ప’ అంటే ‘పంచమం’. దీన్ని కోకిల నుండి తీసుకున్నారు. ‘ద’ అంటే దైవతం. దీన్ని గుర్రం సకలింపు నుంచి తీసుకున్నారు. ‘ని’ అంటే ‘నిషాదం’. దీన్ని ఏనుగు ఘీంకారం నుంచి తీసుకున్నారు.



