← Back to news

ఉద్ధవ్ శివసేనలో తిరుగుబాటు? ఎంపీల ఫోన్లు స్విచ్చాఫ్

By DS· 17 Jun 2026· Mumbai
ఉద్ధవ్  శివసేనలో తిరుగుబాటు? ఎంపీల ఫోన్లు స్విచ్చాఫ్

మహారాష్ట్ర రాజకీయంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) పార్టీలో తీవ్ర అసమ్మతి చెలరేగినట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన కొందరు లోక్‌సభ ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడం, వారు అందుబాటులో లేకపోవడంతో అధికార ఏకనాథ్ షిండే వర్గంలోకి మారతారనే ఊహాగానాలు పెరిగాయి. ముఖ్యంగా ఎంపీ సంజయ్ దేశ్‌ముఖ్, కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్‌ను కలవడం కలకలం రేపింది. అయితే పార్టీలో ఎలాంటి చీలిక లేదని, ఎంపీలంతా ఉద్ధవ్ వెంటే ఉన్నారని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.

More in Politics