NCERT బుక్స్‌లో 'సెంగోల్'

NCERT 9వ తరగతి కొత్త సోషల్ సైన్స్ టెక్ట్స్‌బుక్‌లో ‘అండర్‌స్టాండింగ్ సొసైటీ అండ్ బియాండ్ - పార్ట్ 2’లో సెంగోల్ గురించి వివాదాస్పద థియరీ ఉంది. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి తమిళనాడు ఆదీనం సాధువులు.. నెహ్రూకి సెంగోల్ ఇవ్వడంతో పవర్ ట్రాన్స్‌ఫర్ జరిగిందని రాశారు. చోళ రాజుల కాలపు ఈ సంప్రదాయం.. నైతిక పాలనకు చిహ్నమనీ, అందుకే 2023లో కొత్త పార్లమెంట్‌లో దీన్ని స్థాపించారని రాశారు. దీనికి ఆధారాలు లేవనీ, ఇది రాజకీయ ప్రయత్నమని చరిత్రకారులు రాజ్‌మోహన్ గాంధీ, ఆదిత్య ముఖర్జీలు విమర్శించారు.


