జయమ్మ పాత్ర స్ఫూర్తితో పేదలకు రష్మిక సాయం

నటి రష్మిక ‘రణబాలి’ సినిమాలోని జయమ్మ పాత్ర స్ఫూర్తితో ‘అన్నపూర్ణ’ పేరుతో సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 8 ప్రాంతాల్లోని 400 కుటుంబాలకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమాన్ని ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. సరుకుల కోసం ఖర్చు చేసే డబ్బును ఆదా చేసుకుని కుటుంబాలు భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోవాలని ఆమె ఆశిస్తున్నారు. తనను చూసి మరికొందరు కూడా పేదలకు సాయం చేయాలని రష్మిక కోరారు.


