← Back to news

బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఏది? వైసీపీ విమర్శ!

By బాడాన మహేష్· 58m ago· Lakshimipuram, , Srikakulam
బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఏది?  వైసీపీ విమర్శ!

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కూటమి ప్రభుత్వం నయవంచన రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ Sarubujjili మండల అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, సంక్షేమ పథకాల ద్వారా రూ.1.82 లక్షల కోట్ల ప్రయోజనం అందించినట్లు తెలిపారు.

More in Local