"సౌకర్యాలే లేవు.. ఇక ఆటెక్కడ?"

జపాన్‌లోని ఐచి-నగోయాలో ప్రారంభమైన 2026 ఆసియా క్రీడల్లో భారతీయ క్రీడాకారులు.. వసతి, రవాణా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. సంప్రదాయ క్రీడా గ్రామం నిర్మించలేదు. అధికారిక వసతి లేదు. వారిని క్రూయిజ్ షిప్, కంటైనర్లలో ఉంచుతున్నారు. జిమ్ సౌకర్యాలు కూడా సరిగా లేవు. ఆహార నాణ్యత తక్కువగా ఉంది. వేదికలు 4 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బస్సులు ఆలస్యం అవుతుండటం వల్ల.. ప్లేయర్లు ప్రాక్టీస్ స్లాట్లు కోల్పోతున్నారు. ఈ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



