రక్తదాన సేవలకు నిర్వాకుడికి సన్మానం

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చీలాపూర్ భాస్కరాచారి సేవాసంస్థ ఆధ్వర్యంలో 14ఏళ్లుగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. మాజీ సర్పంచ్ శానగొండ భాస్కరాచారి వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది శిబిరం ఏర్పాటు చేసి ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు రక్తాన్ని అందిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి రక్తం ద్వారా అండగా నిలుస్తున్న సంస్థ సేవలను గుర్తించిన కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సంస్థ నిర్వాహకుడు శానగొండ శరత్‌ను సన్మానించి అభినందించారు.



