ఈజిప్ట్‌లో భారతీయ శిల్పకళ!

ఈజిప్ట్ రాజధాని కైరోలో ఉన్న ‘బ్యారన్ ఎంపైన్ ప్యాలెస్’ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 1907 నుంచి 1911 మధ్య దీన్ని నిర్మించారు. ఈ ప్యాలెస్ కట్టడంలో భారతీయ శిల్పకళ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. బయట ఏనుగులు, పాములు, శివుడు, కృష్ణుడు, బుద్ధుడి బొమ్మలు కనిపిస్తాయి. బెల్జియం వ్యాపారి బ్యారన్ ఎంపైన్ కోసం దీన్ని నిర్మించారు. భారతీయ ఆలయాల శిల్పకళను గుర్తు చేసే ఈ కట్టడం.. కైరోలో ఇండియా కళకు ఓ ప్రత్యేక ఉదాహరణగా నిలిచింది. 2020లో బాగుచేసి ప్రజల కోసం మళ్లీ తెరిచారు.



