← Back to news

ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభం

By Bejjanki· 53m ago· Koheda, Koheda, Siddipet
ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభం

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం అందించే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, హరే రామ కృష్ణ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందించనున్నారు. ఉదయం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లే గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభం
ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభం

More in Local