కుమార్తె ఆచూకీ కోసం తల్లిదండ్రుల ఆవేదన

విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన అలజంగి నాగమణి గత ఐదునెలలుగా కనిపించడంలేదని ఆమె తండ్రి అలజంగి దుర్గారావు ఆవేదన వ్యక్తంచేశారు. నాగమణి భర్త పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని, ఫోన్లు కూడా ఎత్తడం లేదని తెలిపారు. తన కుమార్తె ఆచూకీ కోసం గత నాలుగు నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదన్నారు. విషయాన్ని జనసేన పార్టీ రాజాం నియోజకవర్గ నాయకులు గండి చిరంజీవులు బొబ్బిలి MLA బేబీ నాయన దృష్టికి తీసుకెళ్లారు.



