మినిమం బ్యాలెన్స్ లేదని బ్యాంకులు రూ. 7,087 వసూలు

బ్యాంకు అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని 2025-26 సంవత్సరంలో బ్యాంకులు ప్రజల నుంచి ఏకంగా రూ.7,087 కోట్లు ఫైన్ కింద వసూలు చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం పార్లమెంట్‌లో చెప్పింది. ప్రైవేట్ బ్యాంకులు అత్యధికంగా రూ.4,948 కోట్లు వసూలు చేస్తే, ప్రభుత్వ బ్యాంకులు రూ 2,137 కోట్లు తీసుకున్నాయి. ఫైన్లు వేయడంలో HDFC బ్యాంక్ రూ.1,798 కోట్లతో టాప్‌లో ఉండగా, యాక్సిస్ బ్యాంక్ రూ 1,081 కోట్లతో రెండో ప్లేస్‌లో ఉంది.



