← Back to news

లక్షెట్టిపేటలో గాంధీ జయంతి సెలబ్రేషన్స్

By Sunke Vinith· 1h ago· Luxettipet (Ct), Luxettipet, Mancherial
లక్షెట్టిపేటలో గాంధీ జయంతి సెలబ్రేషన్స్

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ 13వ వార్డులోని గాంధీ చౌక్‌లో గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మంతెన జగన్ మోహన్ రావు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ 7వ వార్డు కౌన్సిలర్ బోడ రాజేంద్రప్రసాద్ 9వ వార్డు కౌన్సిలర్ వడ్డెపల్లి రాయలింగు పాల్గొన్నారు.

More in Local