హైస్కూల్‌లో గాంధీ శాస్త్రి జయంతి సెలబ్రేషన్స్
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి నాగార్జున హైస్కూల్‌లో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ, శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల కరస్పాండెంట్ రాఘవయ్య మాట్లాడుతూ.. గాంధీజీ సత్యం అహింసా మార్గాల్లో స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు. లాల్‌బహదూర్ శాస్త్రి దేశ సేవకు అంకితమై ఆదర్శంగా నిలిచారని చెప్పారు.



