← Back to news

నవంబర్ 5న ఛలో విజయవాడ.. JAC కీలక ప్రకటన

By బొమ్ము దుర్గారావు· 1h ago· Velampalem, Ramachandrapuram, Dr. B.R. Ambedkar Konaseema
నవంబర్ 5న ఛలో విజయవాడ.. JAC కీలక ప్రకటన

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన మహాగర్జన సదస్సులో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై JAC నేతలు కీలక నిర్ణయం ప్రకటించారు. సమస్యలు పరిష్కరించాలని నవంబర్ 5న ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఏపీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అండ్ టీచర్స్ JAC తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మంది ఉద్యోగులతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం, తదితర డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

More in Local