← Back to news

పంట కాలువలోకి మురుగునీరు.. కుంచనపల్లిలో ఆందోళన!

By KUCHIPUDI BUJJIBABU· 52m ago· Salivahanapeta, Mangalagiri, Guntur
పంట కాలువలోకి మురుగునీరు.. కుంచనపల్లిలో ఆందోళన!

గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ కుంచనపల్లిలో ఆందోళన రేగింది. ఎల్ఎం వెంచర్స్ విల్లాస్ నుంచి మురుగునీటిని పంట కాలువలోకి మళ్లిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గత మూడు రోజులుగా 500 అడుగుల మేర ఆరు అంగుళాల పైప్‌లైన్ వేశారు. మురుగునీటిని కాలువలోకి మళ్లిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాలువ ఇప్పటికే అపార్ట్‌మెంట్ వ్యర్థాలతో కలుషితమవ్తోంది. దిగువ గ్రామాల్లో సాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, మున్సిపల్ అధికారులు స్పందించి పరిశీలించాలని కోరుతున్నారు.

పంట కాలువలోకి మురుగునీరు.. కుంచనపల్లిలో ఆందోళన!
పంట కాలువలోకి మురుగునీరు.. కుంచనపల్లిలో ఆందోళన!

More in Local