దానం నాగేందర్ పిటిషన్‌పై 23న సుప్రీంలో విచారణ

TG: పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సవాల్ చేస్తూ ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ <a href="https://www.theclearcutnews.com/n/qsZXRqc">సుప్రీంకోర్టుకు వెళ్లారు.</a> హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను దానం తరఫు సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి ఈరోజు సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. ఖైరతాబాద్ సీటు వేకెంట్ కావడంతో, లేట్ అయితే బైఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని దానం తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(CJI) సూర్యకాంత్ ఈ పిటిషన్‌ను ఈనెల 23న విచారణ జరిపేందుకు అంగీకరించారు.


