25 గ్రామాల్లో కలుషిత నీరు.. SIPCOTపై షాకింగ్ రిపోర్ట్!

తమిళనాడు ఈరోడ్ జిల్లా పెరుందురైలో State Industries Promotion Corporation of Tamil Nadu పారిశ్రామిక కాలుష్యం కలకలం రేపుతోంది. గతేడాది 25 గ్రామాల్లోని 37 నీటి వనరులను తమిళనాడు నీటి సరఫరా, డ్రైనేజీ బోర్డు పరీక్షించగా తాగేందుకు పనికిరావని తేలింది. కాలుష్య నీటిని శుద్ధి చేసేందుకు 136.76 కోట్ల రూపాయలతో Common Effluent Treatment Plant నిర్మిస్తున్నారు. కానీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇంకా కనిపించలేదు. ఈ ప్రాంతంలోని SIPCOTలో 250కిపైగా పరిశ్రమలు ఉన్నాయి.


