సిరిసిల్ల ప్రజావాణికి 140 అర్జీలు

సిరిసిల్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 140 దరఖాస్తులు వచ్చాయి. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ జయశ్రీ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డ్ చేశారు. నిర్ణీత టైమ్‌లోగా సమస్యలను సాల్వ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల RDO ఆఫీస్‌లో 4, వేములవాడ RDO ఆఫీస్‌లో 2 అప్లికేషన్లు వచ్చాయి. ఈ ప్రోగ్రామ్‌లో జడ్పీ CEO వెంకట మాధవరావు ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.



