వీడీసీలను రద్దు చేయాలి: విద్యార్థి సంఘాలు

నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్‌లో వీడీసీల వ్యవస్థకు వ్యతిరేకంగా ఐదు విద్యార్థి సంఘాలు ఐక్యంగా ప్రెస్‌మీట్ నిర్వహించాయి. SFI, AISF, PDSU, BVM, MSF నాయకులు వీడీసీలను వెంటనే రద్దు చేసి రాజ్యాంగం, గ్రామ స్వరాజ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదులపై పోలీసులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారికి వినతిపత్రం ఇవ్వగా, DGPతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.



