ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలి
వింజమూరులో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు కలిగిరి CI సుబ్బారావు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. తక్కువ జీతాలు, ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రైవేట్ టీచర్లు స్టూడెంట్స్‌ను సొంత పిల్లల్లా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పడం గ్రేట్ అని కొనియాడారు. ఈ సందర్భంగా 10th క్లాస్ టాపర్లకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేసి, బెస్ట్ టీచర్లను శాలువాలతో సన్మానించారు. ఈ ప్రోగ్రామ్‌లో పలువురు కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



