← Back to news

రూ.15.27 లక్షలతో రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన

By బొమ్ము దుర్గారావు· 1h ago· Velampalem, Ramachandrapuram, Dr. B.R. Ambedkar Konaseema
రూ.15.27 లక్షలతో రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని వివిధ వార్డుల్లో రూ.15.27 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. కూటమి సీనియర్ నాయకుడు వాసంశెట్టి సత్యం, మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్య పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

More in Local