← Back to news

కేంద్ర హోంశాఖ కార్యదర్శి క్షమాపణపై క్లారిటీ!

By Vishi· 1h ago· X
కేంద్ర హోంశాఖ కార్యదర్శి క్షమాపణపై క్లారిటీ!

ఢిల్లీలో పరిణామాలు, సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులకు సంబంధించి సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలపై కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అది కేవలం న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా అనుసరించే ఒక విధానం అని చెప్పింది. హోంశాఖ కార్యదర్శి నిజంగానే తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పారనే రీతిలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని చెప్పింది.

More in National