ఈ దాడులేంటి? రచ్చ రచ్చ
AP: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు అనగానే.. కత్తులు నెత్తురు చిందుతున్నాయి, రాళ్లు తలలు పగలగొడుతున్నాయి. కర్రలు ఇంతెత్తున లేస్తున్నాయి. హింస రాజ్యమేలుతోంది. కడప.. గాంధీ నగర్ నామినేషన్ సెంటర్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. YCP అభ్యర్థి గుంటి నాగేంద్రపై దాడి చేసి, నామినేషన్ పత్రాలను చింపేశారు TDP కార్యకర్తలు. ఇంత హింస జరుగుతుంటే.. పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదనే ప్రశ్నలొస్తున్నాయి. అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతల్ని పోలీసులు మర్చిపోతున్నారా అని YCP ప్రశ్నిస్తోంది.

