దారులన్నీ శివాజీ పార్కుకే!

ముంబై వేడెక్కింది.. ఎండతో మాత్రమే కాదు.. CJP పిలుపుతో కూడా. మరో గంటలో "జైల్ భరో" ప్రొటెస్ట్ ప్రారంభం కానుండటంతో.. పెద్ద ఎత్తున యువత, యాక్టివిస్టులు తరలివెళ్తున్నారు. రోడ్లపై ఎటు చూసినా, ఎక్కడ చూసినా Gen Z ప్రభంజనం కనిపిస్తోంది. దారులన్నీ శివాజీ పార్క్.. 6వ గేటు వైపు సాగుతున్నాయి. ఐతే.. ఈ ప్రొటెస్టుకి పర్మిషన్ ఇవ్వని పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేశారు. భారీ ఎత్తున మోహరించారు. చూస్తుంటే.. ఢిల్లీ.. జంతర్ మంతర్ తరహాలోనే రచ్చ రచ్చ అయ్యేలా ఉంది.





