Private Mafia పేరుతో వాట్సాప్ గ్రూపు.. నీట్ పేపర్ లీక్ అయింది ఇలా ..!

మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన NEET-UG 2026 ఎలా లీక్ అయిందన్న దానిపై ఇప్పుడు షాకింగ్ డిటైల్స్ బయటపడుతున్నాయి. రాజస్థాన్ అధికారుల దర్యాప్తులో Private Mafia పేరుతో ఓ paid WhatsApp group ఏర్పాటైన విషయం బయటపడింది. ఈ గ్రూప్‌లో చేరేందుకు విద్యార్థులు రూ.5 వేల నుంచి లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. అక్కడ guess paper పేరుతో షేర్ చేసిన ప్రశ్నల్లో దాదాపు 120 ప్రశ్నలు అసలు NEET పరీక్షలో మ్యాచ్ అయ్యాయి. కెమిస్ట్రీ సెక్షన్‌లో భారీ మ్యాచ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ లీక్ మహారాష్ట్రలోని నాసిక్ నుంచి రాజస్థాన్, హర్యానా, కేరళ, ఉత్తరాఖండ్ వరకు విస్తరించినట్లు అనుమానిస్తున్నారు.



