జర్నలిస్టుల డిమాండ్స్ డే.. జగిత్యాలలో నిరసన

జగిత్యాలలో జర్నలిస్టుల డిమాండ్స్ డే నిర్వహించారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) పిలుపు మేరకు TUWJ (IJU) ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. వృత్తిగత సమస్యలు, అణచివేతలు, సంక్షేమ పథకాల అమలులో జాప్యంపై జర్నలిస్టులు ఆందోళన వ్యక్తంచేశారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పునరుద్ధరణ అక్రిడిటేషన్ల జాప్యాన్ని నివారించడం ఇళ్ల స్థలాల కేటాయింపు రక్షణ చట్టం అమలుచేయాలని డిమాండ్ చేశారు.


