కాశ్మీర్‌లో నలుగురిని కాల్చి చంపిన తోటి జవాన్

CISF క్యాంప్‌లో తోటి సిబ్బందిపై హెడ్ కానిస్టేబుల్ కాల్పులు జరపడం కలకలంగా మారింది. కతువా జిల్లాలోని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. సిబ్బంది మధ్య వాగ్వాదం జరగడంతో అవధేష్ కుమార్ వారిని కాల్పాడు. ఇందులో అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, SI లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుళ్లు సందీప్ కుమార్, మహ్మద్ రఫీక్ తీవ్రంగా గాయపడ్డారు. NHPC ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై CISF పూర్తి స్థాయి విచారణ చేపట్టింది.


