← Back to news

UPI QR కోడ్‌.. ఇదో రకం మోసం గురూ!

By A.Ajay· 1d ago

దుకాణాలకు వెళ్లి ఏదైనా కొంటే UPI QR కోడ్‌ స్కాన్ చేసి డబ్బులు పే చేస్తాం. అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. కొందరు మోసగాళ్లు అసలు QR కోడ్‌పై మరో కోడ్‌ను అతికిస్తున్నారు. దీని ద్వారా కస్టమర్లు చెల్లించే డబ్బు వ్యాపారి అకౌంట్‌కు కాకుండా తమ అకౌంట్‌కు వెళ్తుంది. అందుకే QR కోడ్‌పై తమ షాప్ పేరు సరిగ్గా ఉందో చూడాలని, పే చేసే ముందు యాప్‌లో కనిపించే వ్యక్తి పేరును తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.

More in Infotainment