కబడ్డీ జాతీయ రిఫరీ టెస్ట్.. నెల్లూరు వాసి మహేష్ క్వాలిఫై!

కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి రిఫరీ టెస్ట్‌లో నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అంబేద్కర్ నగర్‌కు చెందిన గోసాల మహేష్ బాబు క్వాలిఫై అయ్యారు. దేశ నలుమూలల నుంచి అనేకమంది హాజరైన ఈ కఠిన పరీక్షలో ఉత్తీర్ణులైన 79 మంది రిఫరీలలో మహేష్ 24వ ర్యాంకు సాధించి నెల్లూరు జిల్లాకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచారు. ప్రస్తుతం నెల్లూరులోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.




