మంగళగిరి వైసీపీ సమన్వయకర్తకు ఘన సత్కారం!

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నియమించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యాలయంలో తాడేపల్లి ప్రకాష్‌నగర్, జగజ్జీవన్‌రావు కాలనీ, మదీనా మసీదు కమిటీ పెద్దలు, స్థానికులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్ రాజు, అబ్జర్ అహ్మద్, షేక్ రషీద్, ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.



