మిడ్ మానేరు రిజర్వాయర్లో 23.556 టీఎంసీల నీరు

సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం, మానువాడ: మిడ్ మానేరు రిజర్వాయర్లో శనివారం ఉదయం 6 గంటల వరకు 23.556 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా నీటిమట్టం 316.39 మీటర్లుగా నమోదైంది. 24 గంటల సగటు ఇన్ఫ్రా నిల్గా ఉండగా, 157 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. స్పిల్వే, రివర్ స్లూయిస్ గేట్లు మూసి ఉన్నాయి.



