Latest

మళ్లీ పెరిగిన బంగారం ధరలు
Current Affairs· 18 Aug 2026

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

గ్లోబల్ మార్కెట్‌లో జియోపాలిటిక్స్ కారణాల వల్ల బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం గుడ్ రిటర్న్స్ డేటా ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.230 పెరిగి రూ.1,55,890 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.200 పెరిగి రూ.1,42,900కి చేరింది. గోల్డ్, సిల్వర్ రేట్లు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి కాబట్టి, బై చేసే ముందు లైవ్ ప్రైసెస్ చెక్ చేసుకోవడం బెటర్.

ఝార్ఖండ్‌లో విద్యార్థుల గెలుపు.. సగం డిమాండ్లకు పరిష్కారం!
National· 18 Aug 2026

ఝార్ఖండ్‌లో విద్యార్థుల గెలుపు.. సగం డిమాండ్లకు పరిష్కారం!

ఝార్ఖండ్‌లో రిక్రూట్‌మెంట్ పరీక్షల అవకతవకలపై స్టూడెంట్స్ నిరసనలకు ప్రభుత్వం స్పందించింది. JSSC-CGL పరీక్షను రద్దు చేయడంతో పాటు ప్రైవేట్ ఏజెన్సీ TDPL నిర్వహించిన 2014 నుంచి అన్ని పరీక్షలను రద్దు చేసింది. పరీక్షల కోసం స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయడంతో విద్యార్థుల కొన్ని డిమాండ్లు నెరవేరాయి. అయితే అన్ని డిమాండ్లు పూర్తిగా పరిష్కారం కాలేదు. ముఖ్యంగా అవకతవకలపై CBIతో దర్యాప్తు చేయించాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ అంశంపై విద్యార్థుల అసంతృప్తి కొనసాగుతోంది.

పట్టాల సర్వే, ఆన్‌లైన్ సౌకర్యం కల్పించాలని వినతి
Local· 18 Aug 2026

పట్టాల సర్వే, ఆన్‌లైన్ సౌకర్యం కల్పించాలని వినతి

AP: నంద్యాల జిల్లా సంజామల మండలం గిద్దలూరు గ్రామపంచాయతీ పరిధిలోని చీమలతిప్ప తాండాకు చెందిన గిరిజనులు తమ భూముల సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. 2006లో తమకు మంజూరైన పట్టాలకు సంబంధించి సర్వే నిర్వహించి, ఆన్‌లైన్‌లో నమోదు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో ప్రజాసంఘాల నాయకులతో కలిసి సంజామల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తమకు పట్టాలు మంజూరైనా ఇప్పటివరకు సర్వే, ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు తెలిపారు.

జర్నలిస్టుల సమస్యలపై బిగ్ డిమాండ్.. RDOకు వినతి
Local· 18 Aug 2026

జర్నలిస్టుల సమస్యలపై బిగ్ డిమాండ్.. RDOకు వినతి

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మెగా ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 200 మందికి వైద్యులు సేవలు అందించారు. సన్‌రైజ్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 50 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీవో ఎం.వి. రమణకు వినతిపత్రం అందజేశారు.

DSCపై శాసనమండలిలో YSRCP నిరసనలు
AP· 18 Aug 2026

DSCపై శాసనమండలిలో YSRCP నిరసనలు

AP: శాసనమండలి రెండో రోజు సమావేశాలు DSC అంశంపై వాడీవేడిగా సాగాయి. DSCపై YSRCP సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు రిజెక్ట్ చేశారు. MLCలు నినాదాలు చేస్తూ పోడియం వద్ద నిరసనకు దిగారు. బల్లలు చరుస్తూ ఆందోళన చేశారు. DSCపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత BACకి పిలుస్తామని చైర్మన్ చెప్పినా, వెంటనే చర్చ చేపట్టాలని బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు. దీంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

అయోధ్యలో కోతుల దాడి.. బాలుడికి తీవ్ర గాయాలు
Local· 18 Aug 2026

అయోధ్యలో కోతుల దాడి.. బాలుడికి తీవ్ర గాయాలు

TG: మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా మారిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం అమ్మమ్మ ఇంటికి వచ్చిన దైద సాయి అనే ఆరేళ్ల బాలుడు బయట ఆడుకునేందుకు వెళ్తుండగా కోతులు ఒక్కసారిగా దాడి చేసినట్లు తెలిపారు. బాలుడిని కరిచి తీవ్రంగా గాయపరిచినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామంలో కొన్నేళ్లుగా కోతుల దాడులు పెరిగాయని, ఇప్పటికే పలువురు గాయపడినా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కోతులు ఇళ్లలోకి చొరబడి ప్రజలపై దాడులు చేస్తున్నాయని వాపోయారు.

చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు
Local· 18 Aug 2026

చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు

AP: NTR జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం మండలం చంద్రాల భూనిర్వాసితులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 2016లో రహదారి విస్తరణలో భాగంగా ఇళ్లు, స్థలాలు కోల్పోయిన బాధితులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని ఆరోపిస్తూ వారు పాదయాత్రగా అసెంబ్లీకి బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు చంద్రాల భూ నిర్వాసితులను రైతు భరోసా కేంద్రానికి తరలించారు. అనంతరం మైలవరం తహసీల్దార్ అబ్దుల్ దరియా, ఎస్‌ఐ సుధాకర్ సమక్షంలో ఆర్డీవో నిర్వాసితులతో చర్చలు నిర్వహించారు.

గిగ్ కార్మికుల సమస్యలపై బిగ్ ఫైట్.. పురాణాపూల్‌లో ధర్నా
Local· 18 Aug 2026

గిగ్ కార్మికుల సమస్యలపై బిగ్ ఫైట్.. పురాణాపూల్‌లో ధర్నా

TG: హైదరాబాద్ పురాణాపూల్ చౌరస్తాలో రాపిడో, ఉబర్, గిగ్ వర్కర్లకు మద్దతుగా ఇంక్విలాబ్ సేనా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల అధ్యక్షులతోపాటు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయబాబు, రాజేష్ ముదిరాజ్, ప్రవీణ్, గోపీనాథ్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వెల్లంపల్లి గ్రామంలో మహిళ దారుణ హత్య
Local· 18 Aug 2026

వెల్లంపల్లి గ్రామంలో మహిళ దారుణ హత్య

AP: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి సమీపంలో శ్రీదేవి (35) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. భర్తతో విభేదాల కారణంగా కొంతకాలంగా ఆమె వెల్లంపల్లి గ్రామంలో ఒంటరిగా నివసిస్తుంది. ఘటనాస్థలంలో ఆమె పక్కనే ఉన్న రాయిపై రక్తపు మరకలు కనిపించడంతో.. అదే రాయితో కొట్టి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

స్లీపర్ బస్సు ప్రమాదాలు, టికెట్లపై అసెంబ్లీలో చర్చ!
AP· 18 Aug 2026

స్లీపర్ బస్సు ప్రమాదాలు, టికెట్లపై అసెంబ్లీలో చర్చ!

AP: అసెంబ్లీలో స్లీపర్ బస్సు ప్రమాదాల అంశంపై MLA కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. ప్రమాదాలను అరికట్టేందుకు బస్సుల ఫిట్‌నెస్‌తో పాటు డ్రైవర్ల ఫిట్‌నెస్‌ను కూడా తనిఖీ చేయాలని సూచించారు. ప్రమాదాలకు కారణమయ్యే వారిపై నార్మల్ యాక్సిడెంట్ కేసులకు కాకుండా పీడీ యాక్టులు పెట్టాలని కోరారు. టికెట్ల బుకింగ్‌కు ప్రైవేట్ సైట్లకు బదులుగా ఆర్టీసీ సైట్‌ను ప్రోత్సహించాలని MLA శ్రీధర్‌రెడ్డి సూచించారు. ఫిట్‌నెస్‌లో లోపాలుంటే బస్సులను సీజ్ చేస్తామని మంత్రి రాంప్రసాద్ హామీ ఇచ్చారు.

BJPకి సోషల్ మీడియా కొత్త చీఫ్ దీపక్ మ్హస్కే!
Current Affairs· 18 Aug 2026

BJPకి సోషల్ మీడియా కొత్త చీఫ్ దీపక్ మ్హస్కే!

BJP SM హెడ్ గా 2015 నుంచి ఉన్న అమిత్ మాలవ్య స్థానంలో దీపక్ మ్హస్కేని నియమించింది. కొత్త BJP అధ్యక్షుడు నితిన్ నబిన్ చేసిన మొదటి రీప్లేస్మెంట్ ఇది. దీపక్ ఛత్తీస్గఢ్ పార్టీ అధికార ప్రతినిధిగా, ఆ రాష్ట్ర IT సెల్ హెడ్‌గా పని చేశారు. విద్యార్థుల ప్రొటెస్టుల తర్వాత ఈ మార్పు చెయ్యడం గమనించాలి. కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం అని నబీన్ అన్నారు. రాయ్‌పూర్‌కు చెందిన దీపక్ గతంలో కాలేజీ లెక్చరర్. M.Sc Chemistry చదివారు. BJPలో ఇతనికి డేటా అనాలిసిస్, ఎన్నికల స్ట్రాటజీ expert గా పేరుంది.

వాడపల్లి వెంకన్నకు బంగారు హారం బహూకరణ
Local· 18 Aug 2026

వాడపల్లి వెంకన్నకు బంగారు హారం బహూకరణ

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భారీ బంగారు హారం సమర్పించారు. విశాఖపట్నానికి చెందిన మైత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తెల్ల శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దంపతులు 463.920 గ్రాముల బంగారు హారాన్ని ఆలయానికి బహూకరించారు. దీని విలువ సుమారు రూ.71.94 లక్షలు ఉంటుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. దాత కుటుంబసభ్యులు బంగారు హారాన్ని ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావుకు అందజేశారు.

రాజాంలో కిరాణా షాపుల యజమానుల కొట్లాట
Local· 18 Aug 2026

రాజాంలో కిరాణా షాపుల యజమానుల కొట్లాట

AP: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని GMR కేర్ సెంటర్ సమీపంలో ఉన్న మద్యం దుకాణం ఎదురుగా రెండు కిరాణా దుకాణాల యజమానులు పరస్పరం గొడవపడి దాడులకు పాల్పడ్డారు. ఇరువర్గాలు రోడ్డుపై కొట్లాటకు దిగడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

పొట్టకూటి కోసం వ్యాపారం.. ప్రాణాలతో చెలగాటం
Local· 18 Aug 2026

పొట్టకూటి కోసం వ్యాపారం.. ప్రాణాలతో చెలగాటం

TG: హైదరాబాద్ KPHB కాలనీ పవర్ స్టేషన్‌కు సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ కింద కొందరు వ్యాపారాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఉపాధి కోసం వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు అత్యంత సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయం వ్యక్తమవుతోంది. విద్యుత్‌ ప్రమాదాలు జరిగితే వ్యాపారులతో పాటు అక్కడికి వచ్చే ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.

SIR డ్రాఫ్ట్ లిస్ట్‌లో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేసుకోండి!
Infotainment· 18 Aug 2026

SIR డ్రాఫ్ట్ లిస్ట్‌లో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేసుకోండి!

ఓటర్లు తమ పేరు లిస్ట్‌లో ఉందో లేదో ఆన్‌లైన్‌లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం <a href="https://www.eci.gov.in/">Election Commission</a> ఓటర్ పోర్టల్‌లోని ‘Electoral Roll Download’ విభాగంలోకి వెళ్లాలి. 2026 సంవత్సరాన్ని సెలెక్ట్ చేసి రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, భాష వివరాలను ఎంటర్ చేయాలి. తరువాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి మీ పార్ట్ నంబర్, పార్ట్ పేరును సెలెక్ట్ చేయాలి. ‘Download Selected PDFs’పై క్లిక్ చేస్తే ఓటర్ల లిస్ట్ PDF డౌన్‌లోడ్ అవుతుంది. అందులో మీ పేరు, ఓటర్ వివరాలను చూసుకోవచ్చు.

వ్యాపారిని చంపేస్తానని బెదిరింపు.. రౌడీషీటర్ అరెస్ట్
Local· 18 Aug 2026

వ్యాపారిని చంపేస్తానని బెదిరింపు.. రౌడీషీటర్ అరెస్ట్

AP: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో రౌడీషీటర్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీఐ నవీన్ కుమార్ స్థానిక రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తాజాగా ఓ వ్యాపారిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించిన రౌడీషీటర్ రౌతు తేజపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రౌతు తేజపై గతంలో నాలుగు కేసులు ఉన్నట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు.

కీబోర్డ్‌లో ABCD క్రమంలో అక్షరాలు ఎందుకు ఉండవు..? ⌨️
Technology· 18 Aug 2026

కీబోర్డ్‌లో ABCD క్రమంలో అక్షరాలు ఎందుకు ఉండవు..? ⌨️

మన కీబోర్డ్‌లో అక్షరాలు ABCD క్రమంలో కాకుండా QWERTYగా ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? దీని కథ టైప్‌రైటర్ కాలం నుంచే మొదలైంది. మొదటి టైప్‌రైటర్లలో అక్షరాలు దాదాపు ఆల్ఫాబెటికల్ క్రమంలోనే ఉండేవి. తర్వాత కీబోర్డ్ లేఅవుట్‌లో మార్పులు చేశారు. టైప్‌రైటర్ మెకానిజంలో సమస్యలు తగ్గించడం, టెలిగ్రాఫ్ ఆపరేటర్లు సందేశాలను వేగంగా టైప్ చేయడం వంటి కారణాలు QWERTY రూపకల్పనలో ప్రభావం చూపినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. చివరికి ఇదే లేఅవుట్ ప్రాచుర్యం పొంది.. మన కంప్యూటర్లు, ఫోన్లలోనూ కొనసాగింది.

స్కూల్‌కు స్పోర్ట్స్ యూనిఫాం అందజేత
Local· 18 Aug 2026

స్కూల్‌కు స్పోర్ట్స్ యూనిఫాం అందజేత

TG: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు దాతలు రూ.20 వేల విలువైన స్పోర్ట్స్ యూనిఫాంను అందజేశారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి సహకరించాలనే ఉద్దేశంతో గ్రామానికి చెందిన రితిక్, సతీష్ ఈ క్రీడా దుస్తులను వితరణ చేశారు. దాతలను HM షేక్ అబ్దుల్, ఉపాధ్యాయుడు రఘువీర్ పాఠశాల తరఫున సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గ్రామానికి చెందిన ప్రగత్ తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు రూ.5 వేల విరాళం అందించారు.

పొట్టకూటి కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయిన 8 మంది
National· 18 Aug 2026

పొట్టకూటి కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయిన 8 మంది

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భీండ్ జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్వాలియర్–భీండ్ నేషనల్ హైవేపై ఛిమ్కా గ్రామం దగ్గరలో కూలీలతో వెళ్తున్న పికప్ వెహికల్ ఎదురుగా వస్తున్న డంపర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందారు. మరో 32 మందికి గాయాలయ్యాయి. గ్వాలియర్‌లో వరి నాట్లు పనులు ముగించుకుని ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీకి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న పశువులను తప్పించేందుకు డ్రైవర్ వాహనంపై పట్టు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
Local· 18 Aug 2026

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

TG: హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో అర్హతలు లేని కొందరు వ్యక్తులు RMPల పేరుతో వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరైన వైద్యపరీక్షలు చేయకుండానే అధిక మోతాదులో మందులు సూచిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటి నొప్పితో వచ్చిన ఓ వ్యక్తికి నిమెసులైడ్, డైక్లోఫెనాక్ సోడియం వంటి పెయిన్‌కిల్లర్లతో పాటు సెట్రిజిన్‌ను అధిక మోతాదులో తీసుకోవాలని సూచించినట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు ఉపయోగించిన సూదులను తిరిగి వినియోగిస్తున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆ హాస్పిటల్‌కు ప్రొ. జయశంకర్ పేరు.. విజ్ఞప్తి చేసిన మంత్రి
TG· 18 Aug 2026

ఆ హాస్పిటల్‌కు ప్రొ. జయశంకర్ పేరు.. విజ్ఞప్తి చేసిన మంత్రి

TG: సనత్‌నగర్ TIMS హాస్పిటల్‌కు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ హాస్పిటల్‌ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆయన.. నిర్మాణంలో ఉన్న అల్వాల్ TIMSకు మాజీ సీఎం టి.అంజయ్య పేరు పెట్టాలని కోరారు. అలాగే ఎల్‌బీనగర్ TIMSకు కొండా లక్ష్మణ్ బాపూజీ, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ప్రొఫెసర్ జయశంకర్ పేర్లు పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.