Latest
చార్మినార్ దగ్గర ఫాస్ట్ ఫుడ్ తింటున్నార అయితే జాగ్రత్త!
హైదరాబాద్ చార్మినార్ ఏరియాలోని న్యూ లాడ్ బజార్‌లో తెలంగాణ గవర్నమెంట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ (H-FAST) అధికారులు శనివారం సడన్ దాడులు చేశారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్రంగా ఫాస్ట్ ఫుడ్ తయారు చేస్తున్న 'అల్ అక్బర్' గోడౌన్‌పై ఈ రైడ్స్ జరిగాయి. ఈ దాడుల్లో అధికారులు సుమారు 110 కిలోల పాడైపోయిన ఫ్రైడ్ చికెన్, 6 టిన్ల వాడిన కుళ్లిన నూనె, ఫుడ్‌లో కలిపే డేంజరస్ ఆర్టిఫిషియల్ కలర్స్‌ను సీజ్ చేశారు. ప్రజల హెల్త్‌తో ఆటలాడుకుంటూ రూల్స్ బ్రేక్ చేసినందుకు గానూ గోడౌన్ నిర్వాహకులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాహుల్ గాంధీకి బర్త్‌డే విషెస్ చెప్పిన మోదీ!
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్తూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ మంచి హెల్త్‌తో, సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నట్లు PM మోదీ తన మెసేజ్‌లో పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ, ప్రధాని మోదీ ఇలా ప్రత్యేకంగా విషెస్ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బస్సు, ఆటో ఢీకొని 15 ఏళ్ల స్టూడెంట్ స్పాట్ డెడ్: మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నదరపల్లి దగ్గర ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి డిపోకు చెందిన బస్సు, ఒక ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్‌లో ఆటోలో ఉన్న సంపంగి చరణ్ (15) అనే స్టూడెంట్ అక్కడికక్కడే చనిపోయాడు. పెద్ద దరపల్లికి చెందిన ఆటో డ్రైవర్ రామ్ ఆంజనేయులుతో పాటు ఆటోలో ఉన్న మిగతా పిల్లలకు చిన్న చిన్న గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని ట్రీట్‌మెంట్ కోసం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనతో ఆ ఏరియాలో తీవ్ర విషాదం నెలకొంది.

లైఫ్‌లో ఈ 8 టైప్స్ ఫ్రెండ్స్ మస్ట్!
మీ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంటారు. అలా ఒకే ఫ్రెండ్ నుంచి మీకు కావాల్సినవన్నీ దొరకవని గాలప్ రీసెర్చ్ వెల్లడించింది. అందుకే మీ లైఫ్‌లో కచ్చితంగా 8 రకాల ఫ్రెండ్స్ ఉండాలని ఈ స్టడీ చెప్తోంది. మిమ్మల్ని మోటివేట్ చేసే 'కోచ్', సపోర్ట్ చేసే 'చీర్‌లీడర్', కలిసి వర్క్ చేసే 'పార్ట్నర్', ఎనీటైమ్ తోడుండే 'బెస్ట్ ఫ్రెండ్' అవసరం. అలాగే పరిచయాలు పెంచే 'కనెక్టర్', నవ్విస్తూ ఉండే 'ఫన్ పర్సన్', కొత్త విషయాలు నేర్పే 'ఇంటెలిజెంట్ ఫ్రెండ్', మంచి దారి చూపించే 'మెంటార్' ఉండాలి. ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ మీ లైఫ్‌ని కంప్లీట్ చేస్తాయి. మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో వీరంతా ఉన్నారో లేదో ఒకసారి చూసుకోండి.

బుక్ లవర్స్ కి ఈ ఇంపార్టంట్ డే గురుంచి తెలుసా!
ఈరోజు నేషనల్ రీడింగ్ డే! ఇండియాలో చదివే అలవాటును ఒక ఉద్యమంగా మార్చిన P.N. పణిక్కర్ జ్ఞాపకార్థం జూన్ 19న ఈ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే ఆయన్ని "లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా" అంటారు. రీసెంట్‌గా మన భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌కర్ ఆయన లైఫ్ స్టోరీపై ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ డిజిటల్ యుగంలో ఇన్‌స్టా రీల్స్, ఫోన్లు చూస్తూ బుక్స్ చదవడం తగ్గించేసారు. కానీ నాలెడ్జ్ పెరగాలంటే రీడింగ్ చాలా ఇంపార్టెంట్. సో, ఈరోజు నుంచైనా ఒక మంచి పుస్తకంతో ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేయండి. చదవండి, ఎదగండి.

ముగ్గురు కుమార్తెలను చంపి తండ్రి ఆత్మహత్య
AP: ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం KV అగ్రహారం గ్రామానికి చెందిన ఏకుల సుధాకర్ తన ముగ్గురు కుమార్తెలు గోఅచ్యుత(11), పూజిత (9), లోహిత (8) లను హతమార్చాడు. అనంతరం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న చీమకుర్తి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డెడ్ బాడీలను పరిశీలించారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు.

టెలిగ్రామ్‌కి షాక్.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ డెసిషన్!
నీట్ (NEET UG) ఎగ్జామ్ పేపర్ లీక్ ఇష్యూ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ యాప్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన టెంపరరీ రెస్ట్రిక్షన్స్‌ను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎగ్జామ్స్ సేఫ్టీ, స్టూడెంట్స్ ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనని కోర్టు జస్టిఫై చేసింది. నేషనల్ సెక్యూరిటీ, పేపర్ లీక్స్ కంట్రోల్ చేయడం కోసమే ఈ రూల్స్ అని స్పష్టం చేసింది.

సచివాలయ ఉద్యోగిపై పోక్సో కేసు
AP: తిరుపతి జిల్లా నాయుడుపేటలోని భరత్ నగర్ సచివాలయ ఉద్యోగి విజయరామయ్య తోటి మహిళా పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమె కుమార్తెపై అకృత్యాలకు పాల్పడ్డాడు. విజయరామయ్యకు స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ పరిచయంతో ఆమె కుమార్తె అయిన 9వ తరగతి చదువుతున్న బాలిక బాత్రూమ్‌లో ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు. ఆ వీడియోలను చూపిస్తూ బాలికను బ్లాక్‌మెయిల్ చేస్తూ తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిపై పొక్సో కేసు నమోదు చేశారు.

భారీగా తగ్గిన బంగారం ధరలు!
బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్! మార్కెట్‌లో గోల్డ్ రేట్లు భారీగా పడిపోయాయి. హైదరాబాద్‌లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,650 తగ్గి రూ.1,45,860 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల ధర రూ.3,350 తగ్గి రూ.1,33,700 కి పడిపోయింది. రేట్లు భారీగా తగ్గాయి కాబట్టి షాపింగ్ ప్లాన్ చేసుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్. కానీ ప్రైసెస్ ఎప్పుడైనా మారొచ్చు, సో షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి లైవ్ రేట్ చెక్ చేసుకోండి.

నేచురల్ మెడిసిన్.. వేపతో వ్యాధులకు చెక్
మిరాకిల్ ట్రీగా పిలువబడే వేప దాని శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్‌ఫ్లమేటరీ లక్షణాల కారణంగా సాంప్రదాయ వైద్యంలో గొప్ప చరిత్రను కలిగి ఉంది. వాస్తవానికి వేప దాని విస్తృత శ్రేణి ఆరోగ్య ప్రయోజనాల కారణంగా దీనిని ప్రకృతి ఔషధం అని పిలుస్తారు. వేప ఆకులు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన సర్వ రోగ నివారిణిగా పనిచేస్తాయి. ముఖ్యంగా చర్మవ్యాధులకు ఇది బెస్ట్ మెడిసన్. వేప బెరడు నుంచి ఆకులు, పండ్లు, చివరకు వేరు వరకు ప్రతి ఒక్కటీ వివిధ వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది.

రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ: పవన్ కల్యాణ్
AP: ‘రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ CM పవన్ కల్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ‘గ్రీనింగ్ సొసైటీ’ ఏర్పాటు చేయాలని, జూలై 3వ తేదీ నాటికి సొసైటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావాలన్నారు. ఒకే పంచాయతీలో సాధ్యం కాకపోతే.. 3-4 పంచాయతీలను క్లస్టర్‌గా చేసి, ఉమ్మడిగా ఒక నర్సరీని ఏర్పాటు చేయాలని సూచించారు.

బాలింత చితాభస్మంలో కత్తెర
భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెంకు చెందిన గర్భిణి చాట్ల వనజ(21)కు ఈనెల 13న పురిటినొప్పులు వచ్చాయి. గుండాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్‌నర్సు ఆధ్వర్యంలో కాన్పు చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఇద్దరినీ ఇల్లెందు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. శిశువు అప్పటికే మృతి చెందింది. అనంతరం తల్లి కూడా మృతి చెందింది. తల్లీబిడ్డలకు స్వగ్రామంలో అంత్యక్రియలు చేశారు. వనజ మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతంలో చితాభస్మాన్ని సేకరిస్తుండగా శస్త్రచికిత్సల్లో ఉపయోగించిన కత్తెర బయటపడింది.

ఏఐతో పిల్లలకు పారా సోషల్ అటాచ్ మెంట్
టెక్నాలజీ యుగంలో పిల్లలు మానవ సంబంధాల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరికరాలకే ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఇది వారిలో 'పారాసోషల్ అటాచ్‌మెంట్' (కల్పిత బంధం) పెంచుతూ, నిజమైన భావోద్వేగాలను, సామాజిక నైపుణ్యాలను దూరం చేస్తోంది. డిజిటల్ పరికరాల మితిమీరిన వాడకం వల్ల పిల్లల్లో సానుభూతి లోపించడం, ఒంటరితనం వంటి కొత్త మానసిక సవాళ్లు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలతో గడుపుతూ ఈ డిజిటల్ దూరాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రకృతిని పరిరక్షిస్తే, ప్రకృతే మనల్ని కాపాడుతుంది: రేవంత్‌రెడ్డి
TG: ప్రకృతిని పరిరక్షిస్తే ప్రకృతే మనల్ని కాపాడుతుందని CM రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో తెలంగాణ వన మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. రూ.15 కోట్ల వ్యయంతో రూపొందనున్న ఎకోపార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి రక్షించేందుకు కోట్ల సంఖ్యలో మొక్కలు పెంచుతున్నట్లు CM పేర్కొన్నారు. 30వేల ఎకరాల్లో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో 15వేల ఎకరాల్లో సహజ సిద్ధమైన అటవీ వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అడ్మిషన్ల జోరు.. ప్రభుత్వ స్కూళ్లలో హౌస్‌ఫుల్ బోర్డులు
TG: వనపర్తి జిల్లా కేంద్రంలోని ZP బాలికల ఉన్నత పాఠశాలలో గతేడాది మొత్తం 905 మంది విద్యనభ్యసించగా, ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య వెయ్యి దాటింది. పదిలో ఏకంగా ఆరు సెక్షన్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బోర్గాం(పి) ZP పాఠశాలలో, సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో, నల్గొండ జిల్లా కేంద్రం బొట్టుగూడలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో , సిరిసిల్లలోని గీతానగర్ ZP ఉన్నత పాఠశాలలో అత్యధిక అడ్మిషన్లు వచ్చాయి. దీంతో ఈ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఫోన్‌పే యూజర్లకు షాక్: ఇన్‌యాక్టివ్ వ్యాలెట్లపై ₹100 ఫీజు!
డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే వ్యాలెట్ వినియోగదారుల కోసం కొత్త నిబంధన తెచ్చింది. వరుసగా 12 నెలల పాటు ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇన్‌యాక్టివ్‌గా ఉండే వ్యాలెట్లపై ప్రతి మూడు నెలలకు ₹100 మెయింటెనెన్స్ ఫీజు విధించనున్నారు. ఈ ఛార్జీలను నేరుగా వ్యాలెట్ బ్యాలెన్స్ నుండే కట్ చేస్తారు. అయితే, దీనివల్ల లింక్డ్ బ్యాంక్ ఖాతాలకు ఎలాంటి ప్రమాదం లేదు. ఈ అదనపు ఛార్జీల నుండి తప్పించుకోవడానికి వ్యాలెట్ ద్వారా ఏదైనా ఒక చిన్న లావాదేవీ చేసి దానిని మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలను కనే అంశంపై తల్లి దండ్రుల్లో టెన్షన్ !
పిల్లలను కనాలా వద్దా అనే కీలక నిర్ణయంలో మానసిక ఆరోగ్యం ప్రధాన పాత్ర పోషిస్తోందని ది న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఆందోళన, నిరాశ, ఓసీడీ (OCD) వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తమ అనారోగ్యం పిల్లలకు సంక్రమిస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. మరికొందరు ఒంటరిగా పిల్లల్ని పెంచలేమని వెనకడుగు వేస్తుండగా, ఇంకొందరు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తల్లిదండ్రులుగా మారుతున్నారు. మానసిక స్థితి కుటుంబ నియంత్రణపై తీవ్ర ప్రభావం చూపుతోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

అమ్మయ్య.... హార్మూజ్ లో నౌకలు కదులుతున్నాయ్ !
ప్రపంచ చమురు రవాణా జీవనాడి హర్ముజ్ జలసంధి ఎట్టకేలకు తెరుచుకుంది! అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరడంతో, వంద రోజులకు పైగా అక్కడ నిలిచిపోయిన వందలాది నౌకలు కదలడం ప్రారంభించాయి. ఇప్పటికే చైనా, యూరప్ దేశాలకు చెందిన నౌకలు తమ ప్రయాణాన్ని సాగించాయి. గ్లోబల్ ఆయిల్ సప్లైకి లైన్ క్లియర్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా టెన్షన్లు తొలగిపోయి అందరిలోనూ భారీ రిలీఫ్ వచ్చేసింది!

రఘురామ టార్చర్ కేసుపై ఏపీ హై కోర్టు సీరియస్ కామెంట్స్..
ఏపీ అసెంబ్లీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసుపై ఏపీ హై కోర్టు కీలక కామెంట్స్ చేసింది. ఈ నేరానికి పాల్పడిన వారు, పార్లమెంటుపై దాడి చేసిన వారికి తేడా లేదని కామెంట్ చేసింది. అప్పటి ఎంపీని టార్చర్ చేయబోతున్నారని ముందే తెలిసినా అప్పటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఆ ఘటనలో పాల్గొనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. ఇక ఈ కేసులో ఆ అధికారి సరెండర్ అవుతారా? ముందస్తు బెయిల్ పై ప్రొసీడ్అవుతారా ఏదో ఒకటి తేల్చుకోవాలని కోరింది.

మాది సేమ్ సెక్స్ రొమాన్స్ కాదు-కృతిసనన్
కాక్ టెయిల్ 2 మూవీలో తనకు హీరోయిన్ రష్మికకు మధ్య సేమ్ సెక్స్ రొమాన్స్ ఉందన్న గాసిప్స్ కి బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ చెక్ పెట్టింది. అవన్నీ వట్టి పుకార్లేనని అది లెస్బియన్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీ కానే కాదని క్లారిటీ ఇచ్చింది. ఇది మూడు క్యారెక్టర్ల మధ్య పండిన ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ తో కూడిన స్టోరీ అంటూ వివరణ ఇచ్చింది.

ధర్మస్థల్ 200 కోట్ల డీల్ పై.. ప్రెస్‌మీట్‌లో ప్రకాష్ రాజ్!
ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన రూ.200 కోట్ల డీల్‌లో నటుడు ప్రకాష్ రాజ్‌కు కూడా భాగస్వామ్యం ఉందంటూ మాజీ కార్మికుడు చిన్నయ్య చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై బెంగళూరులో ప్రెస్‌మీట్ పెట్టిన ప్రకాష్ రాజ్, ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే తనకు చిన్నయ్యతో ఎలాంటి సంబంధం లేదని, అతడితో ఒకేసారి ఫోన్ మాట్లాడినట్లు, ఆ జరిగిన ఫోన్ సంభాషణల రికార్డింగ్‌లను కూడా తానే సిట్ (SIT) అధికారులకు పంపానని స్పష్టం చేశారు. గతం లో ఆలయ ఆరోపణలపై దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సిద్ధరామయ్యను తానే కోరినట్లు ప్రకాష్ రాజ్ ప్రెస్‌మీట్‌లో వివరణ ఇచ్చారు.