Latest

‘స్పెషల్ బస్సు’ చార్జీలను వెంటనే తగ్గించాలి
Local· 28 Aug 2026

‘స్పెషల్ బస్సు’ చార్జీలను వెంటనే తగ్గించాలి

రక్షాబంధన్ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులపై ‘స్పెషల్ బస్సులు’ పేరుతో అదనపు చార్జీలు మోపడం దారుణమని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గప్రసాద్ విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టి, ప్రయాణికులతో రాఖీలు కట్టించుకుని ఆందోళన నిర్వహించారు. పండుగల సమయంలో అదనపు బస్సులు నడపడం స్వాగతించదగ్గదేనని, కానీ అదనపు చార్జీలు వసూలు చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

MMTSలో ఇక ఏసీ జర్నీ.. త్వరలో కొత్త రైళ్లు!
Current Affairs· 28 Aug 2026

MMTSలో ఇక ఏసీ జర్నీ.. త్వరలో కొత్త రైళ్లు!

హైదరాబాద్‌ MMTS ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌. రైల్వేబోర్డు ఆదేశాలతో South Central Railway ఏసీ కోచ్‌లపై ప్లాన్‌ చేస్తోంది. ఫస్ట్ ఫేజ్‌లో ఒక్కో MMTS రైలుకు 2–4 ఏసీ కోచ్‌లు అటాచ్ చేయనున్నారు. సెకండ్ ఫేజ్‌లో పూర్తిగా ఏసీ MMTS రైళ్లను నడిపేలా ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు. డిమాండ్‌ పెరగడంతో 3 రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీల్లో వందల ఏసీ కోచ్‌ల తయారీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 2027 ఏప్రిల్‌ నాటికి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు ఘట్‌కేసర్‌–యాదాద్రి ఎక్స్‌పాన్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి.

బంగారం, వెండి ధరలకు బ్రేక్.. దిగొస్తున్న రేట్లు
National· 28 Aug 2026

బంగారం, వెండి ధరలకు బ్రేక్.. దిగొస్తున్న రేట్లు

దేశంలో గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు ఉదయం 6:30 గం. సమయానికి దిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.1,63,120, 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,49,540గా నమోదైంది. కిలో వెండి రూ.2,59,900కి పడిపోయింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,62,970, 22 క్యారెట్ల ధర రూ.1,49,390గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలోనూ ఇదే బంగారం ధరలు కొనసాగగా.. కిలో వెండి రూ.2,64,900గా నమోదైంది. గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనే ముందు మార్కెట్‌లో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్.

వీరయ్య - మరువలేని చరిత్రకి పుస్తక రూపం
Arts/Literature· 28 Aug 2026

వీరయ్య - మరువలేని చరిత్రకి పుస్తక రూపం

కృష్ణ గుబిలి రాసిన ‘వీరయ్య’ పుస్తకం మరుగున పడ్డ చరిత్ర. అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా తెలుగులో వచ్చిన ఈ రచన రచయిత ముత్తాత జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రీకరిస్తుంది. 19వ శతాబ్దం చివర్లో సౌత్ ఆఫ్రికా చెరుకు తోటలకు కూలీలు అవసరమయ్యారు. 13 లక్షల మంది భారతీయులను బ్రిటీష్ వాళ్లు సముద్రం దాటించారు. వాళ్లలో ఒకరు కృష్ణా జిల్లా కొర్లపాడుకు చెందిన వీరయ్య. అక్కడ తోటల్లో వాళ్ల జీవితం..ఆపై 1932లో ఆయన తిరిగి ఈ దేశానికి వచ్చాక జరిగిన విషయాల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. ధర.300. కొనే <a href="https://www.telugubooks.in/products/viriah?srsltid=AfmBOoqz_4iNbW8x6s5-hNBpPGv082K1uEXzp-WQbQnto-XGVIWu8-VG">లింక్</a> ఇది.

విద్యుత్ అమరవీరులకు ఘన నివాళులు
Local· 28 Aug 2026

విద్యుత్ అమరవీరులకు ఘన నివాళులు

TG: విద్యుత్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో సీపీఎం ఆధ్వర్యంలో స్మారక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యుత్ అమరవీరులు రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి చిత్రపటాలకు సీపీఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి. ఆంజనేయులు మాట్లాడుతూ.. విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో నూతన విద్యుత్ సవరణ చట్టం రద్దయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

సోనియా గాంధీ పుస్తకంపై Penguin Random House India ప్రకటన
Arts/Literature· 28 Aug 2026

సోనియా గాంధీ పుస్తకంపై Penguin Random House India ప్రకటన

సోనియా గాంధీ రాసిన 'Belonging: A Journey of Love' పుస్తకానికి తాము పబ్లిషర్స్ కాదని Penguin Random House India చెప్పింది. ఈ పుస్తకం నవంబర్ 10న విడుదల కానుంది. Editorial Changesకు సోనియా గాంధీ నో అనడంతో పెంగ్విన్ వెనక్కి తగ్గిందని కొన్ని వార్తల రావడంతో ఈ ప్రకటన వచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ పుస్తకాన్ని ప్రచురించాలని ఆసక్తిగా ఉన్నామని చెప్పింది.

టైర్ పేలి డివైడర్‌ను ఢీకొట్టిన టెంపో
AP· 28 Aug 2026

టైర్ పేలి డివైడర్‌ను ఢీకొట్టిన టెంపో

AP: ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై పెళ్లి బృందం ప్రయాణిస్తున్న టెంపో టైరు ఒక్కసారిగా పేలడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మచిలీపట్నం నుంచి తిరుమలకు పెళ్లి కోసం వెళ్తుండగా టైరు పేలడంతో అదుపుతప్పిన టెంపో డివైడర్‌ను ఢీకొట్టింది. వాహనంలో 11 మంది ప్రయాణిస్తుండగా పెళ్లికూతురు, పెళ్లికొడుకుతో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారంతా కృష్ణా జిల్లా గూడూరుకు చెందినవారిగా గుర్తించారు.

11 ఏళ్ల అమ్మాయిపై హెడ్‌మాస్టర్ అత్యాచారం
Crime· 28 Aug 2026

11 ఏళ్ల అమ్మాయిపై హెడ్‌మాస్టర్ అత్యాచారం

పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఒక గవర్నమెంట్ స్కూల్ హెడ్‌మాస్టర్ 11 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేశాడు. ఆగస్టు 11న మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 మధ్య గ్రామ స్మశానం దగ్గర ఈ ఘటన జరిగింది. అమ్మాయి తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత, POCSO చట్టం కింద కేసు ఫైల్ చేశారు. నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది.

ఆ ఊళ్లల్లో రాఖీ పండగ జరుపుకోరు
Infotainment· 28 Aug 2026

ఆ ఊళ్లల్లో రాఖీ పండగ జరుపుకోరు

దేశం అంతటా రక్షాబంధన్‌ వైభవంగా జరుపుకుంటారు. కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం తరతరాలుగా ఈ పండుగను జరుపుకోవడం లేదు. UPలోని సథా, ధౌలానా ప్రజలు మహారాణా ప్రతాప్ వంశస్తులు. రాఖీ పండుగ రోజునే జరిగిన ఒక యుద్ధంలో వారి పూర్వీకులు ఓడిపోయి పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఇక్కడ రాఖీ పండుగ జరుపుకోవడం మానేశారు. రాజస్థాన్‌లోని పాలిలో రాఖీ పండుగ రోజునే పాలివాల్ బ్రాహ్మణులపై మహమ్మద్ ఘోరీ దాడి చేసి దారుణంగా చంపేశాడు. అందుకే ఈ రోజును వారు పండుగగా కాకుండా విషాద దినంగా భావిస్తారు.

బైక్, డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపు.. ముగ్గురు అరెస్ట్
Local· 28 Aug 2026

బైక్, డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపు.. ముగ్గురు అరెస్ట్

AP: విజయనగరం జిల్లా రాజాంలో రౌడీషీటర్‌తోపాటు మరోఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనదారుడిని బెదిరించి డబ్బులు, బైక్ లాక్కున్న ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాజాం మెంతిపేటకు చెందిన రౌడీషీటర్ సిరిపురపు దేవరాజు అలియాస్ దేవా, పెనుబాకకు చెందిన దిలీప్, ప్రసాద్‌లు ఫైర్‌స్టేషన్ మామిడితోట వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని అడ్డగించారు. తమ వద్ద ఉన్న డబ్బులు, బైక్ ఇవ్వకపోతే కొట్టి చంపేస్తామని బెదిరించడంతో బాధితుడు భయపడి వాటిని అప్పగించినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు.

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు
Current Affairs· 28 Aug 2026

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు

చైనా, నేపాల్ సరిహద్దు ప్రాంతం అయిన సిచువాన్ ప్రావిన్స్‌లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో నేపాల్‌లో వరద బీభత్సం తగ్గకముందే మరో పెను విలయం విరుచుకుపడనుంది. మూడు రోజుల క్రితం వచ్చిన వరద కంటే దాదాపు ఐదు రెట్ల ఎక్కువ తీవ్రతతో మరో డెడ్లీ వరద ముంచుకొస్తోందని స్థానిక అధికారులు, పోలీసులు అత్యవసర ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ఎగువ ప్రాంతాల నుంచి ఉప్పెనలా దూసుకొస్తున్న ఈ వరద మరో 20 నిమిషాల్లో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తనుందని సమాచారం అందింది. ప్రభావిత ప్రాంతాల్లో Red alert ప్రకటించారు.

పల్లెల్లో ఆర్ఎంపీల ఇష్టారాజ్యం.. ప్రాణాలతో చెలగాటం
Local· 28 Aug 2026

పల్లెల్లో ఆర్ఎంపీల ఇష్టారాజ్యం.. ప్రాణాలతో చెలగాటం

TG: జగిత్యాల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్సకే పరిమితం కావాల్సిన కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు దాటి వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణ ప్రథమ చికిత్సకు మించి బెడ్లు ఏర్పాటు చేయడం, సెలైన్లు ఎక్కించడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, అధిక మోతాదులో మందులు వినియోగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సరైన వైద్య అర్హతలు, అత్యవసర వైద్య సదుపాయాలు లేకుండా చికిత్సలు అందించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.

మర్రి జనార్దన్ రెడ్డికి రాఖీ కట్టిన సోదరి
Local· 28 Aug 2026

మర్రి జనార్దన్ రెడ్డికి రాఖీ కట్టిన సోదరి

TG: నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరి ఇందిర చేత రాఖీ కట్టించుకుని అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆయనకు సోదరి ఇందిర రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతలకు రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ పవిత్ర పండుగను ప్రజలంతా సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

రోడ్డు ప్రమాదం వివాదంగా మారి.. టీచర్‌పై దాడి
Local· 28 Aug 2026

రోడ్డు ప్రమాదం వివాదంగా మారి.. టీచర్‌పై దాడి

AP: పల్నాడు జిల్లా పెదకూరపాడులో స్వల్ప రోడ్డు ప్రమాదం వివాదంగా మారి ఉపాధ్యాయుడిపై యువకులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. రోడ్డు ప్రమాదం విషయంలో తలెత్తిన చిన్నపాటి ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. ఉపాధ్యాయుడిని కారులో నుంచి బయటకు లాగి యువకులు దాడి చేశారు. చిన్నపాటి వివాదాలను సంయమనంతో పరిష్కరించుకోవాల్సిన సమయంలో ఆవేశానికి లోనై చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని స్థానికులు పేర్కొంటున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి దాడికి దారితీసిన పరిస్థితులు, బాధ్యుల వివరాలను పరిశీలిస్తున్నారు.

రోగుల కష్టాలు పట్టవా?.. ఆసుపత్రిలో దుస్థితి
Local· 28 Aug 2026

రోగుల కష్టాలు పట్టవా?.. ఆసుపత్రిలో దుస్థితి

TG: జగిత్యాల జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో తాగునీటి వసతి సరిగా లేకపోవడంతో పాటు రాత్రివేళ పడుకునేందుకు సరైన సౌకర్యాలు లేవని చెబుతున్నారు. దోమలు, ఈగల బెడదతో పాటు అపరిశుభ్రత కారణంగా మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. రక్త, మూత్ర పరీక్షల కోసం వెళ్లిన సమయంలోనూ సిబ్బంది సకాలంలో స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.

ఎమ్మార్పీఎస్‌కు కొత్త నాయకత్వం.. అధ్యక్షుడిగా శామప్ప
Local· 28 Aug 2026

ఎమ్మార్పీఎస్‌కు కొత్త నాయకత్వం.. అధ్యక్షుడిగా శామప్ప

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. బి. కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మండల అధ్యక్షుడిగా పోషమొల్ల శామప్ప మాదిగ, ఉపాధ్యక్షుడిగా పరశురాంను నియమించారు. ఎంఎస్‌పీ మండల అధ్యక్షుడిగా పోతురాజు భీమ్‌సప్ప, ఎంఎస్‌ఎఫ్‌ మండల అధ్యక్షుడిగా కొత్త మళ్లేశ్‌ను ఎన్నుకున్నారు.

గురజాల ఓటర్ల జాబితాపై అప్డేట్.. 44వేల మందికి నోటీసులు
Local· 28 Aug 2026

గురజాల ఓటర్ల జాబితాపై అప్డేట్.. 44వేల మందికి నోటీసులు

AP: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో కొనసాగుతున్న ఓటరు జాబితా సర్వేలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయని ఆర్డీవో మురళీకృష్ణ తెలిపారు. గతంలో 2,75,012 మంది ఓటర్లు ఉండగా, సర్వే అనంతరం ప్రస్తుతం 2,41,254 మంది ఉన్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా 304 నుంచి 328కి పెరిగిందన్నారు. ఇప్పటివరకు 44,511 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాని వారు 7,081 మంది ఉన్నారని చెప్పారు.

పాపను వదిలి.. గోదావరిలోకి దూకి
Local· 28 Aug 2026

పాపను వదిలి.. గోదావరిలోకి దూకి

AP: పశ్చిమగోదావరి జిల్లా చించినాడ వశిష్ఠ వంతెన వద్ద తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి (29), శిరీష (28) దంపతులు తమ కుమార్తెతో కలిసి స్కూటీపై వచ్చారు. అనంతరం చిన్నారిని వాహనంపైనే కూర్చోబెట్టి గోదావరి నదిలోకి దూకినట్లు పోలీసులు తెలిపారు. ఒంటరిగా ఏడుస్తున్న పాపను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చిన్నారిని సురక్షిత ప్రాంతానికి తరలించి, గోదావరిలో దంపతుల కోసం గాలింపు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జగ్గయ్యపేటలో ప్రజా సమస్యలకు పరిష్కార వేదిక
Local· 28 Aug 2026

జగ్గయ్యపేటలో ప్రజా సమస్యలకు పరిష్కార వేదిక

AP: ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలి.. ప్రతి అర్జీపై పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ‘ఒక నెల–ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేటలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జగ్గయ్యపేటలోని ఎస్.వి.ఎస్. కళ్యాణ మండపంలో ఇవాళ ఉదయం 10గంటల నుంచి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారని చెప్పారు.

విమానాశ్రయ ప్రైవేటీకరణ ఆపాలి.. సీపీఎం తీర్మానం
Local· 28 Aug 2026

విమానాశ్రయ ప్రైవేటీకరణ ఆపాలి.. సీపీఎం తీర్మానం

AP: తిరుపతి విమానాశ్రయ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దశలవారీగా పోరాటాలను రూపొందించి ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. సీపీఎం తిరుపతి జిల్లా కమిటీ సమావేశంలో ప్రజా సమస్యలు, దళిత–గిరిజన సమస్యలు, విద్యా రంగ పరిస్థితులు, విమానాశ్రయ ప్రైవేటీకరణపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు.

పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
Local· 28 Aug 2026

పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

TG: రాఖీ పండుగ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయత, సోదరభావాన్ని చాటుతూ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎక్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జూపాక మమత శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినులు తమ సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, సర్పంచ్, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు రాఖీలు కట్టి వేడుకల్లో భాగస్వాములయ్యారు.