Current Affairs· 10 Oct 2026
మోదీ, ఆర్ఎస్ఎస్ ముఖ్య లక్షణం పిరికితనం: రాహుల్ గాంధీ
తను 10 సంవత్సరాలుగా మోదీ, ఆర్ఎస్ఎస్పై పోరాడుతున్నానని, వారి ముఖ్య లక్షణం పిరికితనం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్, జ్ఞానేష్ కుమార్, అజిత్ ధోవల్ లాంటి వారి చుట్టూ ఉచ్చు బిగుస్తోందని అన్నారు. మోదీ ఎంత మంది పోలీసులను పిలిచినా, ఎంత మంది నాయకులను, యువకులను అరెస్టు చేసినా వెనక్కి తగ్గమని అన్నారు. తాము రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పారు.