Viral

కాలు విరిగితే కార్డుబోర్డుతో కట్టు.. హాస్పిటల్‌పై విమర్శలు
Viral· 8 Aug 2026

కాలు విరిగితే కార్డుబోర్డుతో కట్టు.. హాస్పిటల్‌పై విమర్శలు

బిహార్‌లో గవర్నమెంట్ హాస్పిటల్ హెల్త్ ట్రీట్‌మెంట్‌పై విమర్శలు వస్తున్నాయి. రోడ్డు యాక్సిడెంట్‌లో గాయపడి కాలు విరిగిన కృష్ణకుమార్‌కు మంజ్‌హౌల్‌ డివిజనల్‌ హాస్పిటల్లో స్టాఫ్ కార్డుబోర్డు ముక్కలను కాలికి రెండువైపులా ఉంచి, బ్యాండేజీతో కట్టారు. ఆగస్టు 3న హర్సైన్‌ బ్రిడ్జి దగ్గర్లో ఆటో ఢీకొనడంతో కృష్ణకుమార్‌కు గాయాలవ్వడంతో పోలీసు వెహికల్‌లో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. తరువాత బెగుసరాయ్‌ సదర్‌ హాస్పిటల్‌కు రిఫర్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నెటిజన్స్ హాస్పిటల్ స్టాఫ్‌ పనితీరుపై కామెంట్స్ చేస్తున్నారు.

నది దాటుతూ స్కూల్‌కు.. సోషల్ మీడియాలో వైరల్‌
Viral· 4 Aug 2026

నది దాటుతూ స్కూల్‌కు.. సోషల్ మీడియాలో వైరల్‌

మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలో స్కూల్‌కు వెళ్లేందుకు పిల్లలు బేత్వా నదిపై డ్యామ్‌ను దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రతిరోజూ ఈ దారిలోనే వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, విచారణలో ఈ వీడియో విదిశా జిల్లా పలోహ్ గ్రామంలోనిదిగా అధికారులు గుర్తించారు. పలోహ్హై స్కూల్‌కు వెళ్లేందుకు ఈ దారిని ఉపయోగిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు సైకిళ్లు అందించడంతో పాటు వంతెన నిర్మిస్తామని జిల్లా అధికారులు హామీ ఇచ్చారు.