Latest

రావులపాలెంలో పెన్షనర్స్ బిల్డింగ్
AP : విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో మండల పెన్షనర్స్ బిల్డింగ్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగుల సేవలు మరువలేనివని కొనియాడారు. పదవీ విరమణ తర్వాత కూడా వారి అనుభవం ఎంతో విలువైనదని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

సైన్స్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లిన మహానీయుడికి నివాళులు!
AP : ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త డాక్టర్ ఎంపీ పరమేశ్వరన్ సంతాప సూచకంగా యానాంలో నివాళులర్పించారు. జనవిజ్ఞాన వేదిక, CITU నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైన్స్‌ని కేవలం విశ్వవిద్యాలయాలకే పరిమితం చేయకుండా, సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి. నేటి తరానికి ఆయన నిజంగా ఒక మార్గదర్శి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీ సత్యనారాయణ, దాట్ల దేవానందం, అశోక్, దుర్గాప్రసాద్, కుంచే సత్యనారాయణ, రాంబాబు, వాకపల్లి శాస్త్రి, బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.

VLTD ఉంటేనే బండి రిజిస్ట్రేషన్.. భద్రతకు కేంద్రం చర్యలు
ప్రయాణికులు, స్కూల్ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రవాణా వాహనాలు ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ కావాలంటే VLTD(Vehicle Location Tracking Device) తప్పనిసరి చేసింది. ఏఐఎస్-140 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన ఈ పరికరం ప్యానిక్ బటన్‌తో ఉండాలి. దీనికి ఎలాంటి మినహాయింపులు గానీ, గడువు పెంపు గానీ ఉండవని కేంద్ర రవాణా శాఖ స్పష్టం చేసింది.

గుండె సమస్యతో బాధపడుతున్న మహిళకు రూ.5 లక్షల LOC
TG : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పరిధిలోని ఇంద్రవెల్లి బుద్దనగర్‌కు చెందిన కాంబ్లే జయశ్రీ గుండె సమస్యతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు ఆపరేషన్ అవసరమని డాక్టర్లు చెప్పడంతో, ఇంద్రవెల్లి టౌన్ ప్రెసిడెంట్ జితేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తెలుసుకున్న వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సీఎం సహాయనిధి నుంచి రూ. 5 లక్షల LOC ని మంజూరు చేయించారు. ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కును బాధితురాలి కుటుంబసభ్యులకు అందించారు.

14 దేశాల్లో TRS పార్టీ అధ్యక్షుల నియామకం
విదేశాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లోని 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించారు. మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సుల్గే శ్రీనివాస్‌ను నియమించారు. ఆస్ట్రేలియాకు కిషోర్ కత్తి, యూకేకు సుమన్ రావు బాల్మూరి, కెనడాకు వెంకట్రామణ్ మెట్పల్లి, ఇటలీకి కిషోర్ యాదవ్, యూఏఈకి శేఖర్ గౌడ్ ఆరె, సౌదీ అరేబియాకు మొజ్జమ్ అలీ ఇఫ్తేకర్‌లను అధ్యక్షులుగా బాధ్యతలు ఇచ్చారు.
అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు
TG : నాగర్ కర్నూలు జిల్లా చారకొండ రైతు వేదికలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యం పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

‘నా జీవిత యాత్ర’ - టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథ
‘నా జీవిత యాత్ర’ అనేది ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథ. ఇది నాలుగు భాగాలుగా ఉంది. మొదటి మూడు భాగాలు ప్రకాశం పంతులు స్వయంగా రాశారు. నాలుగో భాగం శిష్యుడు, అనుచరుడు తెన్నేటి విశ్వనాథం రాశారు. 1972లో ఎమెస్కో సంస్థ అన్ని భాగాలు కలిపి పుస్తకంగా తీసుకొచ్చారు. సుమారు 900 పేజీల పుస్తకం ఇది. దీన్ని ఇంగ్లీషులో ‘The Journey of My Life’ పేరుతో అనువదించారు. తెలుగు పుస్తకం ధర రూ.500. ఈ <a href="https://newvishalandhrabooks.com/product/tanguturi-prakasam-naa-jeevitha-yatra-%E0%B0%9F%E0%B0%82%E0%B0%97%E0%B1%81%E0%B0%9F%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B0%82-%E0%B0%A8%E0%B0%BE/">లింక్</a> ద్వారా కొనొచ్చు.
'జలసిరి’తో భూగర్భ జలాలు సేవ్ చేద్దాం! 💧
TG : నిజామాబాదు జిల్లాలో వర్షపు నీటిని వేస్ట్ చేయకుండా భూమిలోకి ఇంకించి, వాటర్ లెవెల్స్ పెంచడమే లక్ష్యంగా నందిపేట్ రాజ్‌నగర్ (ధుబ్బా) ఎస్సీ హాస్టల్ దగ్గర ‘జలసిరి’ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం వెర్టికల్ సోక్‌పిట్ (ఇంకుడు గుంత) పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాన నీటిని వేస్ట్ కాకుండా ఇంకుడు గుంతల్లోకి మళ్లిస్తే వాటర్ ప్రాబ్లమ్స్ రావు అని చెప్పారు. నెక్స్ట్ జెనరేషన్ కోసం నీటిని పొదుపుగా వాడుతూ, వాన నీటిని కాపాడుకోవాలని అన్నారు.

SIR ఫేస్ 2
TG : హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో SIR ప్రక్రియ ఫేస్ 2 ను విజయవంతం చేయాలని పరకాల AMC చైర్మన్, నియోజకవర్గ ఇంచార్జ్ చందుపట్ల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా బూత్‌ల వారీగా వివరాలను పరిశీలించాలని BLAలకు సూచించారు. ప్రజలకు ఈ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ పనిచేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలన్నారు.

పొలం బాట పట్టిన స్కూలు పిల్లలు
TG : వరంగల్ జిల్లా నర్సంపేటలోని Wisdom High School విద్యార్థులు వ్యవసాయ పొలాలను సందర్శించారు. ప్రాక్టికల్‌గా వరి పంట ఎలా పండిస్తారో తెలుసుకోవడానికి ఫీల్డ్ ట్రిప్ వెళ్లారు. ఉపాధ్యాయులు పిల్లలకు క్రాప్ ప్రాసెసింగ్ చూపించి లైవ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కేవలం క్లాస్‌రూమ్ బుక్స్ వరకే పరిమితం కాకుండా, ఇలాంటి ప్రకృతి పర్యటనల వల్ల స్టూడెంట్స్‌కి మైండ్ రిఫ్రెష్ అయ్యి బాగా అర్థమవుతుంది. రైతుల కష్టం, ఫుడ్ వాల్యూ, ‘రైతే దేశానికి వెన్నెముక’ అనే మెయిన్ కాన్సెప్ట్‌ను వీరికి నేర్పించడమే ఈ ట్రిప్ ముఖ్య ఉద్దేశం.

శ్మశాన వాటికలో తీరిన నీటి తిప్పలు
TG : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీలోని హిందూ శ్మశాన వాటికలో ఇన్నాళ్లూ ఉన్న నీటి సమస్యకు పరిష్కారం లభించింది. నీటి సౌకర్యం లేక అంత్యక్రియలకు వచ్చే ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానిక నాయకులు గుర్తించారు. అందె మోహన్ ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్మన్ బసవప్ప, కౌన్సిలర్ బచ్చలి నరేష్‌లు కలిసి శ్మశాన వాటికలో కొత్తగా బోరు వేయించారు. దీంతో ఇకపై ఇక్కడికి వచ్చే వారికి నీటి కొరత తీరనుంది. సమస్యను పరిష్కరించిన నాయకులకు స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

కరెంట్ షాక్‌తో లైన్‌మెన్‌కు తీవ్ర గాయాలు
TG : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మోకాసిగూడెం స్టేజి దగ్గర విద్యుత్ ప్రమాదం జరిగింది. 33 కేవీ కరెంట్ స్తంభానికి తగులుతున్న చెట్టు కొమ్మలను నరకడానికి జూనియర్ లైన్‌మెన్ మహేందర్ స్తంభం ఎక్కాడు. ఆ సమయంలో అనుకోకుండా కరెంట్ షాక్ తగలడంతో ఆయన స్తంభం పైనుంచి కింద పడిపోయాడు. ఇది చూసిన చుట్టుపక్కల ప్రజలు వెంటనే స్పందించి, 108 అంబులెన్స్‌లో లైన్‌మెన్ చికిత్స కోసం లక్షిట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
మానవుల రికార్డులను తిరగరాస్తున్న రోబోలు
చైనాలోని బీజింగ్‌లో ‘వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్’ ఆసక్తికరంగా జరుగుతున్నాయి. రెండు వేలకు పైగా రోబోలు పాల్గొంటున్న ఈ పోటీల్లో, మొదటి రోజే రోబోలు అద్భుతాలు చేశాయి. 100 మీటర్ల పరుగును ఒక రోబో కేవలం 9.39 సెకన్లలోనే పూర్తి చేసి, ఉసేన్ బోల్ట్ (9.58 సెకన్లు) ప్రపంచ రికార్డును దాటేసింది. 400 మీటర్ల పరుగును 39.70 సెకన్లలోనే పూర్తి చేసి వేడ్ వాన్ నీకెర్క్ (43.03 సెకన్లు) రికార్డును కూడా బద్దలు కొట్టాయి. మనుషుల కంటే వేగంగా పరుగెడుతూ ఈ రోబోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఏనుగు పిల్లను చూసేందుకు వెళ్లి.. కాళ్ళ కిందపడి వ్యక్తి మృతి
జార్ఖండ్ రాష్ట్రం రామ్‌గఢ్ గోబర్దరహా ఫారెస్ట్ ఏరియాలో దారుణ ఘటన జరిగింది. నవజాత (ఇప్పుడే పుట్టిన) ఏనుగు పిల్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి వెళ్లారు. కొందరు దగ్గరగా వెళ్లి వీడియోలు, రీల్స్ తీసేందుకు ప్రయత్నించారు. దీంతో పిల్లకు దగ్గరలో ఉన్న తల్లి ఏనుగు జనంపైకి దూసుకొచ్చింది. భయంతో పారిపోతుండగా యశ్వంత్ మహతో అనే యువకుడి బైక్ కంట్రోల్ తప్పి పడిపోయాడు. ఏనుగు కాళ్ళ కింద పడడంతో ఆ వ్యక్తి మరణించాడు.

నర్సంపేటలో MRPS నూతన కమిటీలు
TG : MRPS, MSP, MSF నర్సంపేట అర్బన్, రూరల్ కొత్త కమిటీలను సెప్టెంబరు 2న ఏర్పాటు చేయనున్నట్లు దళితరత్న అవార్డు గ్రహీత కళ్లపెళ్లి ప్రణయ్‌దీప్ తెలిపారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో జరిగిన ఎమర్జెన్సీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గడిచిన 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ చేసిన పోరాటాల వల్ల ఆరోగ్యశ్రీ, బియ్యం కోటా, పింఛన్ల పెంపు వంటి మంచి ఫలితాలు వచ్చాయని గుర్తుచేశారు. మాదిగల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ప్రతీ ఒక్కరూ ఐక్యంగా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

నెల్లూరు జిల్లాల్లో కొత్త ఆఫీసర్స్
AP : నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 35 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు ఆఫీసర్లను కేటాయించారు. ఉదయగిరికి వెంకటరెడ్డి, సీతారాంపురానికి రమేష్ నాయక్, వరికుంటపాడుకు వెంకటేశ్వర్లు, దుత్తలూరుకు MD జహురుద్దీన్ అహ్మదాస్, వింజమూరుకు సింహాద్రి, కొండాపురానికి శ్రీనివాస్ రెడ్డి, జలదంకి మండలానికి విశాక్‌లను స్పెషల్ ఆఫీసర్లుగా అపాయింట్ చేశారు.

ఇవాళ రాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు బంద్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల డ్రైవర్లు నిరవధిక సమ్మెకు దిగనున్నారు. కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఇచ్చిన పిలుపుమేరకు ఈ బంద్ కొనసాగుతోంది. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ రవాణా రంగ కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన రేట్లకు అనుగుణంగా మీటర్ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ కార్మికుల సమ్మె విరమించుకోవాలని, వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

పరకాల మున్సిపాలిటీ అభివృద్ధి పై ఫోకస్
TG : హనుమకొండ జిల్లాలోని పరకాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్ తెలిపారు. 5వ వార్డులో పర్యటించిన ఆయన, లోకల్ పీపుల్‌తో మాట్లాడి వాళ్ల ప్రొబ్లెమ్స్ అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో కౌన్సిలర్ గొడుగు రజిత నాగరాజు, శానిటరీ ఇన్స్‌పెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు
AP : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం నేషనల్ హైవే 44 పై రెండు బైక్‌లు యాక్సిడెంట్ అయి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి కండిషన్ సీరియస్‌గా ఉండగా స్పాట్‌కు చేరుకున్న పోలీసులు అంబులెన్స్ పిలిపించి ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేస్ ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మళ్లీ ఉద్యమం: CJP
కేంద్రంపై CJP మరోసారి ఫైర్ అయ్యింది జూలై 25న దేశవ్యాప్త ఉద్యమాన్ని ఆపడానికి కారణమైన హామీలను ప్రభుత్వం ఇప్పుడు నెరవేర్చకుండా వెనక్కి తగ్గుతోందని ఆరోపించింది. విద్యార్థులు, నిరసనకారులపై దేశవ్యాప్తంగా నమోదైన FIRల లిస్టు ఇవ్వాలని, అన్నింటినీ ఒకేసారి రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు సూచించినా, ప్రభుత్వం ఆ లిస్ట్ ఇవ్వడానికి ఇష్టపడటం లేదని చెప్పింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మళ్లీ ఉద్యమం చేస్తామని స్పష్టం చేసింది. తర్వాత కార్యాచరణ నిర్ణయించేందుకు రేపు CJP జాతీయ కార్యనిర్వాహక కమిటీ సమావేశమవుతోంది.

అంబులెన్స్‌లోనే డెలివరీ 🚑
TG : మంచిర్యాల జిల్లా సుద్దాలకు చెందిన సరితకు డెలివరీ పెయిన్స్ రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి కాంప్లికేట్ అవ్వడంతో హనుమకొండ ఆస్పత్రికి షిఫ్ట్ చేయమని డాక్టర్లు చెప్పారు. 108 అంబులెన్స్‌లో వెళ్తుండగా దారిలోనే నొప్పులు ఎక్కువయ్యాయి. దాంతో EMT వెంకటేశ్, డాక్టర్ల సలహాలతో అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. సరిత మగబిడ్డకు జన్మనివ్వగా, ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ సేఫ్‌గా ఉన్నారు.