Latest

CJP నేతలపై దాడి.. కాళ్ళు, చేతులు విరగ్గొట్టారు!
National· 21 Aug 2026

CJP నేతలపై దాడి.. కాళ్ళు, చేతులు విరగ్గొట్టారు!

రాజస్థాన్‌లో CJP నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆశుతోష్ రాంక మరియు వాలంటీర్లపై దాడి జరిగింది. గేదెల కొట్టంలో నడుస్తున్న స్కూల్‌ను బాగుచేయడానికి వెళ్లగా, విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఆదేశాలతోనే BJP గుండాలు ఈ అటాక్‌కు పాల్పడ్డారని <a href="https://www.theclearcutnews.com/n/8ASbtUa">ఆశుతోష్</a> ఆరోపించారు. ఈ ఇన్సిడెంట్‌లో వాలంటీర్ల చేతులు విరిగిపోయాయని, మహిళల ఫోన్లు పగలగొట్టారని, వెహికల్స్‌ను ధ్వంసం చేశారని తెలిపారు. స్పాట్‌లో ఉన్న పోలీసులు స్పందించలేదని మండిపడ్డారు. నిందితులను 48 గంటల్లో అరెస్ట్ చేయకపోతే ప్రొటెస్ట్ తీవ్రతరం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

కలెక్టరేట్‌ను పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దాలి
Local· 21 Aug 2026

కలెక్టరేట్‌ను పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దాలి

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్‌లోని విస్తృతంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను సంబంధిత శాఖలు చేపట్టాలని ఆదేశించారు. ఊటకుంటను పరిశీలించిన కలెక్టర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. డబ్ల్యూడీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో మొక్క నాటి, క్రమం తప్పకుండా నీరు అందించి సంరక్షించాలని అధికారులను ఆదేశించారు.

Blackmail Politics ఎన్నాళ్లు చేస్తారు: MLA నాయిని రాజేందర్
TG· 21 Aug 2026

Blackmail Politics ఎన్నాళ్లు చేస్తారు: MLA నాయిని రాజేందర్

TG: కొండా సురేఖ పార్టీలో, ప్రభుత్వంలో ఉంటూ ఇలా వ్యవహరించడం సరికాదని వరంగల్ వెస్ట్ MLA నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు ఎన్నాళ్లు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలి వెళ్లిపోలేదా? అని నిలదీశారు. కొండా సురేఖపై AICC కఠిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె తీరును ప్రజలు, కార్యకర్తలు అసహ్యించుకుంటున్నారని మరికొందరు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కాదని మంత్రి పదవులు ఇచ్చినా ఇంతకాలం ఊరుకున్నామని అన్నారు.

అండర్ బైపాస్ నిర్మించాలని రైల్వే జీఎంకు ఎంపీ వినతి
Local· 21 Aug 2026

అండర్ బైపాస్ నిర్మించాలని రైల్వే జీఎంకు ఎంపీ వినతి

TG: రైల్వే గేటు మూసివేసిన ప్రతిసారీ వాహనదారులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ రైల్వే గేటు వద్ద అండర్ బైపాస్ బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూ గురువారం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవకు వినతిపత్రం అందజేశారు. రైల్వే గేటు వద్ద తరచూ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ వివరించారు.

కాలేజీకి వెళ్లాలంటే ప్రాణాలతో చెలగాటం
Local· 21 Aug 2026

కాలేజీకి వెళ్లాలంటే ప్రాణాలతో చెలగాటం

AP: కాకినాడ జిల్లా కరప మండలంలో ఆర్టీసీ బస్సుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ పెరిగినా, అందుకు అనుగుణంగా అదనపు బస్సులు అందుబాటులోకి రాలేదు. వేలంగి నుంచి నడకుదురు వరకు సుమారు 15 గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. బస్సుల్లో చోటులేక ఫుట్‌బోర్డులపై ప్రమాదకరంగా నిలబడుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు హెచ్చరిస్తున్నా కాలేజీ సమయానికి చేరుకోవాలనే ఆత్రుతతో తప్పనిసరి పరిస్థితుల్లో అలా ప్రయాణిస్తున్నారు.

‘వందేమాతరం’ మొదటి రెండు స్టాంజాలు మాత్రమే అందరికీ సరిపోయేవి
Current Affairs· 21 Aug 2026

‘వందేమాతరం’ మొదటి రెండు స్టాంజాలు మాత్రమే అందరికీ సరిపోయేవి

‘వందేమాతరం’పై కొనసాగుతున్న చర్చలో సీనియర్ నటి శర్మిలా ఠాగూర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ గీతంలోని మొదటి రెండు స్టాంజాలు మాత్రమే పాడాలని ఆమె అన్నారు. భారతదేశం వివిధ మత విశ్వాసాలు ఉన్న ప్రజలకు నెలవు అని, కొంతమంది ఒకే దేవుణ్ణి ఆరాధించే విశ్వాసాలను కలిగి ఉంటారని అన్నారు. పాటలోని తరువాతి భాగాల్లో కాళి, దుర్గ వంటి హిందూ దేవతల ప్రస్తావన ఉండటం వల్ల కొన్ని సమాజాల విశ్వాసాలకు అవి సరిపోకపోవచ్చని చెప్పారు. మొదటి రెండు స్టాంజాలు మాత్రమే అన్ని మతాల ప్రజలకు సరిపోయేవి అని అభిప్రాయపడ్డారు.

CJP ఆశుతోష్ రాంకపై అటాక్!
National· 21 Aug 2026

CJP ఆశుతోష్ రాంకపై అటాక్!

రాజస్థాన్‌లో <a href="https://www.theclearcutnews.com/n/anxNZyh">CJP కో-కన్వీనర్</a> ఆశుతోష్ రంకా మరియు పార్టీ వాలంటీర్లపై దాడి జరిగింది. ఈ అటాక్‌లో ఆశుతోష్‌తో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా, వారు ప్రయాణిస్తున్న కార్ విండో గ్లాసులను కొందరు పూర్తిగా ధ్వంసం చేశారు. BJP కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని CJP వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాజస్థాన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కళ్లముందే ఈ ఇన్సిడెంట్ జరిగినా వారు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని CJP ఫౌండర్ <a href="https://x.com/abhijeet_dipke/status/2090662536496685145?s=20">అభిజిత్ దీప్కె</a> విమర్శించారు.

అనంతగిరిలో ఆదివాసీ గిరిజనుల పాదయాత్ర
AP· 21 Aug 2026

అనంతగిరిలో ఆదివాసీ గిరిజనుల పాదయాత్ర

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని కొండ శిఖర గ్రామాల్లో ఉంటున్న గిరిజనులను ఏజెన్సీ ప్రాంత గిరిజనులుగా గుర్తించి, వారి భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ పాదయాత్ర నిర్వహించారు. రొంపిల్లి పంచాయతీ పరిధిలోని చిన్నకోనెల గ్రామం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర బూరిగ, సిమ్మిడివలస, రాయపాడు, బొంగిజ తదితర గ్రామాల మీదుగా సుమారు ఐదు కిలోమీటర్ల మేర సాగింది. గిరిజనులు జాతీయ జెండాలను చేతబట్టి, డోలీలు, అడ్డాకులతో పాదయాత్రలో పాల్గొన్నారు.

హిసార్ కోర్టు హత్య..హిమాంశు సోనిపట్ బాధ్యత
Crime· 21 Aug 2026

హిసార్ కోర్టు హత్య..హిమాంశు సోనిపట్ బాధ్యత

హర్యానాలోని హిసార్ కోర్టు వద్ద గ్యాంగ్‌స్టర్ వినోద్ పనూ అలియాస్ కానా నిన్న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య తామే చేశామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హిమాంశు సోనిపట్ సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించాడు. రోహిత్ సోనిపట్, అనిల్ పండిట్, హర్మాన్ సంధూ ఆదేశాల మేరకు ఈ దాడి చేసినట్లు తెలిపాడు. పోలీసులు ఈ పోస్ట్ ప్రామాణికతపై దర్యాప్తు చేస్తున్నారు.

వినాయక చవితి, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
Local· 21 Aug 2026

వినాయక చవితి, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

AP: వినాయక చవితి, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఒకే సమయంలో జరుగుతున్నాయని, ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది వినాయక చవితి కార్యక్రమాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానుండగా, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరగనున్నాయని చెప్పారు. సెప్టెంబర్ 15న సీఎం తిరుపతికి రానున్నారని, బందోబస్తు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం: నలుగురి అరెస్ట్
Crime· 21 Aug 2026

డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం: నలుగురి అరెస్ట్

ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు 'డిజిటల్ అరెస్ట్' పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర సైబర్ ముఠాను ఛేదించి, పంజాబ్, రాజస్థాన్‌లలో నలుగురిని అరెస్ట్ చేశారు. ఒక రిటైర్డ్ ఆర్మీ కల్నల్ నుండి రూ. 15 లక్షలకు పైగా నక్కేసిన కేసులో ఈ చర్యలు తీసుకున్నారు. టెలిగ్రామ్ ద్వారా బ్యాంక్ ఖాతాలను సేకరించి, కంబోడియా, యుఏఈల్లోని సైబర్ నేరగాళ్లకు అందించినట్లు నిందితులు అంగీకరించారు. ఈ ఖాతాకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల లావాదేవీలతో కూడిన 17 ఫిర్యాదులు నమోదు అయ్యాయి.

పోలీసుల బిగ్ ఆపరేషన్.. డ్రోన్‌తో స్పెషల్‌ పెట్రోలింగ్‌
Local· 21 Aug 2026

పోలీసుల బిగ్ ఆపరేషన్.. డ్రోన్‌తో స్పెషల్‌ పెట్రోలింగ్‌

TG: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు నిఘా పెంచారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌ పరిధిలోని శ్రీరాంపూర్‌ పోలీసులు డ్రోన్‌ సహాయంతో ప్రత్యేక పెట్రోలింగ్‌ నిర్వహించారు. ప్రగతి స్టేడియం పరిసరాలు, అరుణక్కనగర్‌, హైవే ప్రాంతాల్లో డ్రోన్‌ ద్వారా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు గుర్తించారు. వారిపై మూడు ఓపెన్‌ డ్రింకింగ్‌ కేసులు నమోదు చేసినట్లు శ్రీరాంపూర్‌ సీఐ ఆకుల అశోక్‌ తెలిపారు.

కొండా సురేఖపై కాంగ్రెస్ MLAలు ఫైర్.. రాజీనామాకు డిమాండ్
TG· 21 Aug 2026

కొండా సురేఖపై కాంగ్రెస్ MLAలు ఫైర్.. రాజీనామాకు డిమాండ్

TG: కొండా సురేఖపై కాంగ్రెస్ MLAలు, MLCలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంటనే రాజీనామా చేయాలని లేదా బర్తరఫ్ చేయాలని పట్టుబట్టారు. CLP సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి 15 మంది MLAలు, ఐదుగురు MLCలు హాజరయ్యారు. CM రేవంత్ రెడ్డిపై అలా మాట్లాడటం సరికాదని MLAలు అన్నారు. కొండా సురేఖ వెంటనే తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. సీఎంకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు.

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం: రాజ్యసభ ఎంపీ కుమారుడిపై కేసు
Crime· 21 Aug 2026

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం: రాజ్యసభ ఎంపీ కుమారుడిపై కేసు

హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ, జనసేన నాయకుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ ప్రయాణిస్తున్న ఆస్టన్ మార్టిన్ కారు భారతి ముఖి అనే 26 ఏళ్ల షాపింగ్ మాల్ ఉద్యోగినిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా మృతిచెందింది. మాదాపూర్ పోలీసులు వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు కేసు నమోదు చేశారు. అయితే ఇది బెయిలబుల్ నేరం కావడంతో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

రాజస్థాన్ లో  CJP  టీమ్ అడ్డగింత
National· 21 Aug 2026

రాజస్థాన్ లో CJP టీమ్ అడ్డగింత

రాజస్థాన్‌లోని బాగ్రూ గ్రామంలో ప్రభుత్వ స్కూల్ పరిస్థితి చూడటానికి వెళ్లిన Cockroach Janata Party (CJP) టీమ్‌ను కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. School Thik Karo క్యాంపెయిన్‌లో భాగంగా అక్కడికి వెళ్లిన CJP కో-కన్వీనర్ ఆశుతోష్ రాంకా, ఇతర కార్యకర్తలను వెనక్కి పంపించారు. తమ కార్యకర్తలపై దాడి చేసి “టెర్రరిస్టులు, నక్సలైట్లు” అంటూ అన్నారని CJP కార్యకర్త శివాంగి శర్మ చెప్పారు. “ఔట్‌సైడర్‌, ఇన్‌సైడర్‌ అని ఎందుకు? ఇది ఒక్క దేశం.. మన దేశంలోని పిల్లల గురించే మాట్లాడుతున్నాం” అని ఆమె అన్నారు.

ఫిర్యాదులకు డైరెక్ట్ యాక్సెస్.. ‘ఓపెన్ బాక్స్’ ఏర్పాటు
Local· 21 Aug 2026

ఫిర్యాదులకు డైరెక్ట్ యాక్సెస్.. ‘ఓపెన్ బాక్స్’ ఏర్పాటు

TG: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి వివేక్ వెంకటస్వామి వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా తన దృష్టికి తీసుకువచ్చేందుకు ‘ఓపెన్ బాక్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ, కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకోవడమే తన ఉద్దేశమన్నారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, అవసరమైతే తనపై ఉన్న ఫిర్యాదులను కూడా పెన్ను, పేపర్‌పై స్పష్టంగా రాసి బాక్స్‌లో వేయాలని కోరారు.

మున్సిపల్ కార్మికులకు సెలవుల జీవో సీఐటీయూ పోరాట ఫలితమే
Local· 21 Aug 2026

మున్సిపల్ కార్మికులకు సెలవుల జీవో సీఐటీయూ పోరాట ఫలితమే

TG: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిర్వహించిన పోరాటాల ఫలితంగానే వారాంతపు సెలవులు, నెలవారీ సెలవులు, క్యాజువల్ సెలవులు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని సీఐటీయూ నాగర్‌కర్నూలు జిల్లా కోశాధికారి పొదిల రామయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులతో కలిసి మున్సిపల్ మేనేజర్‌కు ప్రభుత్వ సర్క్యులర్ జీవోను అందించారు.

గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు
Local· 21 Aug 2026

గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈనెల 3న వేటకు వెళ్లిన బోటు 16వ తేదీకి తిరిగి రాకపోవడంతో కుటుంబాలు అధికారులకు సమాచారం ఇచ్చాయి. కోస్ట్‌గార్డ్, మెరైన్‌ పోలీసు లు, నేవీ డార్నియర్ విమానాలతో 216 నాటికల్ మైళ్ల పరిధిలో గాలింపు చేపట్టారు. ఇలాంటి ఘటనలు నివారించేందుకు ఎస్‌ఓపీ అమలు చేసి, ప్రతి బోటు, మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.

మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలి
Local· 21 Aug 2026

మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలి

TG: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మాలీ కులస్థులకు ఎస్టీ హోదా కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యామ్‌రావు డిమాండ్ చేశారు. ఎస్టీ హోదా సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. గత ఎన్నికల్లో బీజేపీ నాయకులు మాలీలకు ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినా, ఎన్నికల అనంతరం పార్లమెంట్‌లో గానీ అసెంబ్లీలో గానీ ఈ అంశాన్ని ప్రస్తావించడం లేదని విమర్శించారు.

కన్న కూతురిపై తండ్రి దారుణం
Crime· 21 Aug 2026

కన్న కూతురిపై తండ్రి దారుణం

TG: హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్టలో ఘోరం జరిగింది. ఒక తండ్రి తన 12 ఏళ్ల కూతురిపై కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతూ, ఫ్యామిలీని బెదిరిస్తున్నాడు. గురువారం రాత్రి అతను మళ్ళీ మరోసారి దాడి చేయడానికి ట్రై చేయగా, ఆ చిన్నారి ఏమాత్రం భయపడకుండా డైరెక్ట్ Dial 112కి కాల్ చేసి పోలీసులకు విషయం చెప్పేసింది. స్పాట్‌కి వచ్చిన పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇలాంటి రాక్షసుడికి న్యాయస్థానం కఠినమైన శిక్ష విధించాలని కోరుకుందాం.

'సీఎం రేవంత్ రెడ్డి పతనం మొదలైంది'
Local· 21 Aug 2026

'సీఎం రేవంత్ రెడ్డి పతనం మొదలైంది'

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి పతనం మొదలైందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ నుంచి భారీగా కొనసాగిన నిరసన మహాధర్నా ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేశారు. ఆడపిల్లల వివాహాలకు అండగా నిలిచే పథకాలను నిర్వీర్యం చేయడం దారుణం అని విమర్శించారు.